Begin typing your search above and press return to search.

ఓటీటీ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 'విట్నెస్'

By:  Tupaki Desk   |   14 Dec 2022 11:30 PM GMT
ఓటీటీ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విట్నెస్
X
ఈ మధ్య కాలంలో థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాలతో సమానంగా ఓటీటీ సినిమాలు మరియు సిరీస్ లు ఆధరణ దక్కించుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్న ఓటీటీ సినిమాలు మరియు సిరీస్ లు ప్రేక్షకులకు మస్త్‌ వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమా విట్నెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సోని లివ్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విట్నెస్ సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. శ్రద్దా శ్రీనాథ్ మరియు రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్ ను కలిగి ఉండటంతో ఓటీటీ లో ఈ సినిమాను తెగ చూస్తున్నారు.

తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా డబ్‌ చేసి స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు శ్రద్దా శ్రీనాధ్ మరియు రోహిణిలు సుపరిచితులు. కనుక ఒక డబ్బింగ్‌ సినిమా చూస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ కలుగుతోంది అనే టాక్ వస్తుంది.

తప్పక చూడాల్సిన ఒక మంచి సినిమా అంటూ చూసిన వారు రివ్యూలు ఇస్తున్నారు. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు సోషల్‌ మీడియాలో పాజిటివ్ గా టాక్ వచ్చింది. అందుకే ఈ సినిమాకు మంచి ఆధరణ సోని లివ్‌ లో దక్కుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతున్న కారణంగా కచ్చితంగా ఈ సినిమా మరింత మందికి చేరువ అవ్వడం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.