Begin typing your search above and press return to search.

ఆ నాలుగు ఆఫ‌ర్ల‌తో ప్ర‌భాస్ రెవెన్యూ 500 కోట్లు!

By:  Tupaki Desk   |   21 Aug 2021 5:01 PM IST
ఆ నాలుగు ఆఫ‌ర్ల‌తో ప్ర‌భాస్ రెవెన్యూ 500 కోట్లు!
X
`బాహుబ‌లి` ఫ్రాంఛైజీ సంచ‌ల‌న విజ‌యంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ హిట్స్ ప్రభాస్ రేంజును అమాంతం పెంచేశాయి. సాహో చిత్రం విజ‌యం డార్లింగ్ కి హిందీ బెల్ట్ లో ఉన్న ఫాలోయింగ్ ని ఎలివేట్ చేసింది. ఆ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌భాస్ లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా కథాంశాల‌ను ఎంచుకుంటూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. టాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల స్థాయిని సైతం ఛేంజ్ చేసిన ఘ‌నత ప్ర‌భాస్ కే ద‌క్కుతుంది.

కేవ‌లం ఎంచుకునే క‌థ‌లు కంటెంట్ ప‌రంగానే కాదు పారితోషికం ప‌రంగానూ ప్ర‌భాస్ రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేసింది. `బాహుబ‌లి` సిరీస్ అనంత‌రం ప్ర‌భాస్ భారీ పారితోషికం అందుకుంటున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన `సాహో` చిత్రానికి సుమారు 100 కోట్ల‌ రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేసారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్`.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్`.. బాలీవుడ్ దర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్ 3డి`...నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఆది పురుష్ -3డి చిత్రంతో ప్ర‌భాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇవ‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీలో రూపొందుతున్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. నాలుగు చిత్రాల బ‌డ్జెట్ లు ఏక‌మొత్తంగా సుమారు 1600 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాల నుంచి డార్లింగ్ సంపాద‌న ఎంత‌? ఒక్కో సినిమా నుంచి ఏమేర‌కు పారితోషికం తీసుకుంటున్నారు? అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి. ఈ నాలుగు సినిమాల నుంచి ప్ర‌భాస్ దాదాపు 500 కోట్ల మేర ఆర్జిస్తున్నార‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌భాస్ ఒక్కో సినిమాకి 100కోట్ల పారితోషికం ఏరియా వైజ్ హ‌క్కులు ఛేజిక్కించుకుంటున్నార‌న్న స‌మాచారం ఉంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఆదిపురుష్ 3డి దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్‌ ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ చిత్రానికి 200-300 కోట్లు పైగానే పెడుతున్నారు. రాధేశ్యామ్ కి 150కోట్లు పైగానే ఖ‌ర్చు చేశార‌న్న స‌మాచారం ఉంది. అలాగే నాగ్ అశ్విన్ - వైజ‌యంతి మూవీస్ చిత్రానికి 500 కోట్లు పైగా బ‌డ్జెట్ పెడుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

కేవ‌లం నాలుగు సినిమాల‌కు ఇంత పెద్ద మొత్తం పారితోషికం అందుకున్న వేరొక హీరో లేరు. ఇదే గ‌నుక నిజ‌మైతే అతి త‌క్కువ సినిమాల‌కు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డు సృష్టించిన‌ట్లే. బాహుబ‌లి సినిమాకు ప్ర‌భాస్ పారితోషికంతో పాటు లాభాల్లో భారీగా షేర్ ని కూడా తీసుకున్నారు. ఇటీవ‌ల‌ పెరిగినే క్రేజ్ నేప‌థ్యంలో తాజా చిత్రాల‌కు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు ప్ర‌భాస్ తో ముందే నిర్మాణ సంస్థ‌లు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అటు య‌ష్ రాజ్ సంస్థ.. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ డార్లింగ్ ప్ర‌భాస్ ని లాక్ చేసేందుకు 100కోట్ల పారితోషికాన్ని ఆఫ‌ర్ చేసాయ‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ సంక్రాంతి 2022 కానుక‌గా విడుద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత స‌మ్మ‌ర్ కి ఇయ‌ర్ ఎండ్ కి డార్లింగ్ ట్రీట్ ఉంటుంది. ఆదిపురుష్ 3డి.. స‌లార్ చిత్రాలు వ‌చ్చే ఏడాది రిలీజ‌వుతాయి. నాగ్ అశ్విన్ తో సినిమాకి రెండేళ్ల సుదీర్ఘ స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం.