Begin typing your search above and press return to search.
ఈ ఛాన్స్ తో సౌత్ లో నెం.1 స్థానంకు థమన్
By: Tupaki Desk | 4 April 2021 3:00 PM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ సినిమాలకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కు గట్టి పోటీ అన్నట్లుగా థమన్ టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇక తమిళంలో అనిరుథ్ కు గట్టి పోటీ ఇస్తూ అక్కడ కూడా పెద్ద ఆఫర్లు దక్కించుకుంటున్నారు. తెలుగు మరియు తమిళంలోనే కాకుండా థమన్ జోరు ఇతర భాషల్లో కూడా కంటిన్యూ అవుతోంది. పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నా ఎంతో బిజీగా ఉన్నా కూడా కొత్త ఆఫర్లను థమన్ అస్సలు వదులుకోవడం లేదు. సాధ్యం అయినంత వరకు ఎక్కువ సినిమాలు చేస్తూ టాప్ సంగీత దర్శకుడిగా ఇప్పటికే నిలిచాడు. తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కనుక నిజం అయితే రాబోయే రోజుల్లో సౌత్ సినీ ఇండస్ట్రీలో నెం.1 సంగీత దర్శకుడిగా థమన్ నిలవడం ఖాయం అంటున్నారు.
ఇంతకు ఆ ప్రచారం ఏంటీ అంటే.. సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ఒక సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రేజీ మూవీకి అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంగీత దర్శకుడిగా థమన్ కు అవకాశం వచ్చిందంటున్నారు. శంకర్ గతంలో ఎక్కువగా ఏఆర్ రహమాన్ తో కలిసి వర్క్ చేశారు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రహమాన్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యాడు. అందుకే శంకర్ సౌత్ సంగీత దర్శకుడిని చూసుకున్నాడు అంటున్నారు. థమన్ నిజంగానే శంకర్.. చరణ్ ల కాంబో మూవీకి సంగీతాన్ని అందిస్తే అదే ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలువబోతుంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం దిల్ రాజు టీమ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.