Begin typing your search above and press return to search.
ఉప్పెన మూవీతో ఉప్పాడ జనాలను డైరెక్టర్ తలెత్తుకునేలా చేసాడు: రాంచరణ్
By: Tupaki Desk | 18 Feb 2021 2:00 PM ISTమెగాఫ్యామిలీ డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన మూవీ ఇటీవలే విడుదలై సక్సెస్ అందుకున్న సందర్బంగా చిత్రబృందం రాజమండ్రిలో సక్సెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ సక్సెస్ మీట్ లో ఉప్పెన కాస్ట్ అండ్ క్రూతో పాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ హాజరయ్యాడు. అంతేగాక చాలాసేపు ఉప్పెన మూవీ గురించి టీమ్ గురించి మాట్లాడడం కూడా జరిగింది. రాంచరణ్ మాట్లాడుతూ.. ముందుగా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ నవీన్, రవిలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు తనకు రంగస్థలం సినిమా టైం నుండి తెలుసనీ చెప్పిన రాంచరణ్.. అప్పుడు తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా చూసి ఇప్పుడు డైరెక్టర్ గా చూడటం ఆనందంగా ఉండన్నాడు.
అలాగే బుచ్చిబాబు లైఫ్ లో సుకుమార్ బెస్ట్ ఆచార్య. అలాంటి బెస్ట్ ఆచార్యకు బెస్ట్ స్టూడెంట్ అని ఉప్పెన సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు బుచ్చి. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి సినిమా చేయడం గొప్ప విషయం. ఏంటో నెంబర్స్ వింటున్నాను 50, 60 అంటూ.. బహుశా ఇండస్ట్రీలో ఒక కొత్త దర్శకుడికి రావాల్సిన బెస్ట్ కలెక్షన్స్ బుచ్చికి ఫస్ట్ సినిమాకే వచ్చిందంటే మాములు విషయం కాదు. ఇకముందు కూడా ఇలాగే గ్రౌండెడ్ గా ఉంటూ.. గ్రౌండ్ రియాలిటీతో మంచి సినిమాలు తీయాలనీ కోరుతున్నాను. అలాగే ఉప్పాడ గ్రామం నుండి వచ్చి ఉప్పాడ జనాలు తలెత్తుకునేలా చేసినందుకు సంతోషంగా ఉంది' అంటూ డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు రాంచరణ్. ప్రస్తుతం రాంచరణ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
