Begin typing your search above and press return to search.

నందినిరెడ్డితో అప్పుడు సామ్ ఇప్పుడు చై!

By:  Tupaki Desk   |   29 March 2022 6:30 AM GMT
నందినిరెడ్డితో అప్పుడు సామ్ ఇప్పుడు చై!
X
టాలీవుడ్ లో రేర్ గా మ‌హిళా ద‌ర్శ‌కులు రాణిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో మహిళా ద‌ర్శ‌కుల వెల్లువ తెలుగులో ఏమంత లేద‌నే చెప్పాలి. అయితే నందిని రెడ్డి స్ట్ర‌గ్లింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్నా త‌న‌వంతు ప్ర‌య‌త్నాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ద‌ర్శ‌కురాలిగా బిజీ అవుతూనే ఉన్నారు.

ఇటీవ‌లే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో ఓ బేబి లాంటి హిట్ చిత్రాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ తో విదేశీ చిత్రాన్ని రీమేక్ చేసి స‌త్తా చాటారు నందిని.

ఇప్పుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమాకి ప‌ని చేసేందుకు నందిని రెడ్డి సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే క‌థ వినిపించి చైతూని స‌ద‌రు మ‌హిళా ద‌ర్శ‌కురాలు లాక్ చేశార‌ని తెలిసింది.

నందిని రెడ్డి ఇంత‌కుముందు స‌మంత‌తో జ‌బ‌ర్ధ‌స్త్ సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఓ బేబి చేయడానికి చాలా కాలం వేచి చూశారు.

ఇక‌పోతే చైత‌న్య‌తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అంటే.. చై వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. థాంక్యూ తర్వాత విక్ర‌మ్ కె తోనే అత‌డు దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

అదే స‌మ‌యంలో వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించే పీరియాడిక్ డ్రామాలో చైత‌న్య న‌టిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూర్త‌య్యాకే నందినిరెడ్డితో సినిమా ఉంటుంది. దీనిని వైజ‌యంతి బ్యానర్ లో అశ్వ‌నిద‌త్‌- స్వ‌ప్నాద‌త్ సంయుక్తంగా నిర్మిస్తార‌ని తెలిసింది.