Begin typing your search above and press return to search.

చిరు, బాలయ్యలతో... ఈ కేజీఎఫ్‌ స్టార్‌ కి డబుల్‌ ధమాకా

By:  Tupaki Desk   |   23 Nov 2022 11:30 PM GMT
చిరు, బాలయ్యలతో... ఈ కేజీఎఫ్‌ స్టార్‌ కి డబుల్‌ ధమాకా
X
కేజీఎఫ్ లో నటించిన దాదాపు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. కేజీఎఫ్ రెండు పార్ట్‌ ల్లో కనిపించి మెప్పించిన ప్రముఖ కన్నడ నటుడు అవినాష్‌ సౌత్‌ లో అన్ని భాషల్లో సినిమా ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ఇటీవలే ఈయన బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా పేర్కొన్నాడు.

గోపీచంద్ మలినేని తో ఉన్న ఫొటో ను షేర్ చేసి బాలయ్య సినిమాలో తాను ఉన్నట్లుగా ఈ కేజీఎఫ్ నటుడు కన్ఫర్మ్‌ చేశాడు. ఇప్పుడు అదే కేజీఎఫ్ స్టార్‌ అవినాష్ తెలుగు లో మరో బిగ్‌ సినిమాలో నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్‌ చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో తాను నటిస్తున్నట్లుగా ఈ ఫొటోను షేర్‌ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

వాల్తేరు వీరయ్య సినిమాలో బాబీ సింహా తో కలిసి నటిస్తున్నట్లుగా అవినాష్ తెలియజేశాడు. జిగర్తాండ మరియు మహాన్ సినిమాల్లో మిమ్ములను చూసి మీ నటన చూసి ఆశ్చర్యపోయాను.

ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా కోసం మీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ అవినాష్ తన ట్వీట్‌ లో ఈ ఫొటో ను షేర్ చేసి పేర్కొనడం జరిగింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా పోరాడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో రెండు సినిమాల్లో కూడా ఈ కేజీఎఫ్ స్టార్‌ నటించడంతో ప్రస్తుతం ఈయన వార్తల్లో నిలుస్తున్నాడు.

అవినాష్‌ ప్రస్తుతం ఈ రెండు క్రేజీ సినిమాల్లో మాత్రమే కాకుండా మరి కొన్ని కన్నడ మరియు తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. హిందీ నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. పవర్ ఫుల్‌ విలన్‌ రోల్స్ కు అవినాష్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు అంటూ ఆయన్ను ఇలా వరుస సినిమాల్లో ఫిల్మ్‌ మేకర్స్ తీసుకుంటున్నారు. అందుకే ఈ సంక్రాంతికి కేజీఎఫ్ స్టార్‌ అవినాష్ కి డబుల్‌ ధమాకా దక్కినట్లు అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.