Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : రొటీన్ మసాలా 'విన్నర్'

By:  Tupaki Desk   |   12 Feb 2017 5:18 AM GMT
ట్రైలర్ టాక్ : రొటీన్ మసాలా విన్నర్
X
ఈ మధ్యన అయితే ఏదన్నా కొత్తగా మెసేజ్ ఇచ్చే పాయింట్ తో కథలు.. లేదంటే రొటీన్ సినిమాలో కాస్త కొత్తగా హీరో యాటిట్యూడ్ ను బేస్ చేసుకుని రావడం.. షరా మామూలు అయిపోయింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా మరోసారి రొటీన్ స్టోరీతోనే కాస్త కొత్తగా ప్రెజెంటేషన్ చేస్తూ మన ముందుకు వచ్చేశాడు. ''విన్నర్'' అంటున్నాడు.

డాన్ శీను.. పండగ చేస్కో.. వంటి సినిమాలను తీసిన గోపిచంద్ మలినేని డైరక్షన్లో.. ''విన్నర్'' సినిమా రూపొందింది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా సాయి ధరమ్ తేజ్.. అలాగే ఒక అథ్లెట్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ మెగా మేనల్లుడు కావల్సినన్ని పంచ్ డైలాగులు వదులుతుంటే.. తన అందాలతో అతడికి బౌన్సర్లు ఇస్తోంది రకుల్. ఇకపోతే విలన్ గా జగపతి బాబు నటించాడు. అసలు సినిమా కథలో ఖాళీగా ఉన్న ల్యాండ్ లో గుర్రపు పంథాలు పెట్టడం అనే అంశం ఏదైతే ఉందో.. అది కొత్తగానే ఉందిలే. ఇకపోతే ఓవరాల్ గా థమన్ పాటలు.. వెలిగొండ శ్రీనివాస్ పంచ్ డైలాగులూ.. రకుల్ అందాలు.. పాటల విజువల్స్.. కలర్ ఫుల్ లుక్స్.. అదిరాయ్. రొటీన్ మసాలాయే కాని.. కామెడీ క్లిక్ అయితే.. యాక్షన్ సక్సెస్ అయితే.. సినిమా హిట్టయ్యే ఛాన్సుంటుంది.

నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 24 లేదా మరో వారం గ్యాప్ లో రిలీజవుతోందని ట్రేడ్ వర్గాల టాక్.