Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాను వదిలేసినా వింక్ బ్యూటీ

By:  Tupaki Desk   |   18 May 2020 11:15 AM IST
సోషల్ మీడియాను వదిలేసినా వింక్ బ్యూటీ
X
మలయాళ మూవీ ఓరు ఆధార్ లవ్ సినిమా లో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కసారిగా సోషల్ మీడియా సంచలనం అయినా విషయం తెలిసిందే. ఆ సినిమాలో పాటలో ముద్దు గన్ పేల్చడం తో పాటు కన్నుగీటి కుర్ర హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ కు ఆ సినిమా నిరాశ పరిచినా కూడా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ ను దక్కించుంది.

సినిమాలు పెద్దగా చేయనున్న కూడా సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ తన అభిమానులను దగ్గరగా ఉండేది. కానీ ఈ మధ్య తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా డియాక్టీవ్ చేసింది. ఉన్నట్లుండి ఈమె సోషల్ మీడియాను వీడటం అందరికి షాకింగ్ గా ఉంది. అసలు విషయం ఏంటి అంటూ ఆమెను అడుగగా అసలు విషయం చెప్పుకొచ్చింది.

గత కొన్నాళ్లుగా అసహ్యంగా తన పోస్ట్ లకు కామెంట్స్ చేస్తూ నన్ను నా ఫ్యామిలీని అవమానిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అందుకే నాకు సోషల్ మీడియా అంటేనే విరక్తి పుట్టింది. తనకు మానసిక బాధను కలిగించే ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ఉండాలని అనుకున్నా కూడా నా వాళ్ళ కాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేయాల్సి వచ్చిందని ప్రియా సన్నిహతుల వద్ద వాపోయినట్లుగా మలయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఈమె సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చేనా అనేది చూడాలి.