Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వింక్‌ బ్యూటీ మోస్ట్‌ బోల్డ్‌ అండ్‌ రొమాంటిక్

By:  Tupaki Desk   |   1 July 2021 5:30 AM GMT
పిక్ టాక్ : వింక్‌ బ్యూటీ మోస్ట్‌ బోల్డ్‌ అండ్‌ రొమాంటిక్
X
మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సోషల్‌ మీడియాలో ఒకానొక సమయంలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయ్యింది. ఆమె ముద్దు గన్ను మరియు కన్ను గీటే వీడియోలు వీడియోలు వైరల్‌ అయినట్లుగా ఇప్పటి వరకు ఏ ఇండియన్ సెలబ్రెటీ వీడియోలు కూడా వైరల్‌ అయ్యి ఉండవు. అంతగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ గుర్తింపు దక్కించుకుంది. కాని హీరోయిన్ గా మాత్రం ఆమెకు నిరాశ తప్పడం లేదు. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా కొత్త సినిమా ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.

ఈ అమ్మడు ప్రస్తుతం ఒకటి రెండు మలయాళ సినిమాలు చేయడంతో పాటు తమిళంలో ఒక సినిమా కు సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తెలుగు లో ఈమె నటించిన ఇష్క్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. తేజ సజ్జా తో కలిసి ఈ అమ్మడు ఇష్క్‌ లో నటించింది. బోల్డ్‌ పాత్రలకు ఓకే అన్నట్లుగా ఈ అమ్మడు వరుసగా బోల్డ్ స్టిల్స్ ను షేర్‌ చేస్తూ వస్తోంది.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటో మరోసారి ఆమెను నెట్టింట చర్చనీయాంశంగా మార్చేసింది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఈ ఫొటోను తీశారు అంటూ ఈ ఫొటోను షేర్‌ చేసిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నెట్టింట సందడి చేస్తోంది. బోల్డ్‌ లుక్ తో పాటు రొమాంటిక్ చూపులు కాస్త డిఫరెంట్ స్టైల్‌ లో ట్రై చేసింది. ఫొటో లో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చూపు మోస్ట్‌ రొమాంటిక్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అందాల ప్రదర్శణ సినిమాల్లో ఆఫర్ల కోసమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా కొందరు మాత్రం ఈమెకు మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునే ఫీచర్స్ ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియాంక వారియర్ మళ్లీ నెట్టింట బోల్డ్‌ లుక్ తో ఆకట్టుకుంటుంది. తెలుగు లో ఈమె ఇష్క్‌ తర్వాత ఆఫర్లను దక్కించుకుంటుందేమో చూడాలి.