Begin typing your search above and press return to search.
యంగ్ హీరో ప్రొడ్యూసర్ గా అయినా సక్సెస్ అవుతాడా...?
By: Tupaki Desk | 4 Sept 2020 5:40 PM ISTయువ హీరో సందీప్ కిషన్ సినిమాల్లో నటిస్తూనే మూవీ ప్రొడక్షన్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. 'వెంకటాద్రి టాకీస్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాలో నటించి నిర్మించాడు. ఈ క్రమంలో 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే సినిమా పట్టాలెక్కించేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - వెంకటాద్రి టాకీస్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - సందీప్ కిషన్ - దయా పన్నెం కలిసి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. 'ఏ1 ఎక్స్ ప్రెస్' సినిమాతో పాటు రీసెంటుగా మరో సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సందీప్ కిషన్ వెల్లడించారు. 'వివాహ భోజనంబు' అనే క్యాచీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఓ స్టార్ కమెడియన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సందీప్.. ప్రొడ్యూసర్ గా అయినా సక్సెస్ అవుతాడా అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా, సందీప్ కిషన్ 'ప్రస్థానం' సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. 'స్నేహగీతం' 'రొటీన్ లవ్ స్టోరీ' 'గుండెల్లో గోదారి' 'వెంకటాద్రి ఎక్సప్రెస్' 'జోరు' 'బీరువా' 'శమంతకమణి' 'మనసుకు నచ్చింది' 'టైగర్' 'డీ ఫర్ దోపిడీ' 'నిను వీడని నీడను నేను' 'తెనాలి రామకృష్ణ' వంటి సినిమాల్లో నటించాడు. ఇక 'షోర్ ఇన్ ద సిటీ' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సందీప్.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్సప్రెస్' రేంజ్ సాలిడ్ హిట్ సందీప్ కి మళ్ళీ పడలేదనే చెప్పాలి. సినిమా కోసం ఎంతగానో కష్టపడే సందీప్ కిషన్ మూవీస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా యావరేజ్ గా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ గా మారిన ఈ యువ హీరో 'వివాహ భోజనంబు' సినిమాతో డబ్బులు రాబట్టి.. 'ఏ1 ఎక్స్ ప్రెస్' తో ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.