Begin typing your search above and press return to search.

కియ‌రాని పెళ్లాడ‌తావా? కుర్ర‌హీరోకి క‌ర‌ణ్ ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:30 AM GMT
కియ‌రాని పెళ్లాడ‌తావా? కుర్ర‌హీరోకి క‌ర‌ణ్ ప్ర‌శ్న‌!
X
కాఫీ విత్ కరణ్ 7 ప్రోమోలు వ‌రుస‌గా రిలీజ‌వుతున్నాయి. కొత్త ఎపిసోడ్స్ తో క‌ర‌ణ్ దుమ్ము రేపుతున్నాడు. కొంచెం తీపి కొంచెం వగ‌రు ఇంకొంచెం చేదు అన్నీ ఈ షోలో ఉన్నాయి. వివాదాలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా- విక్కీ కౌశల్ షోలో క‌ర‌ణ్ ప్ర‌శ్న‌లు వేడెక్కించాయి. కరణ్ జోహార్ SOTY (స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్) నటుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాని త‌న ప్రేయ‌సి కియారా అద్వానీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు.

కాఫీ విత్ కరణ్ 7 తాజా ఎపిసోడ్ లో హోస్ట్ కరణ్ జోహార్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల వైవాహిక జీవితంతో పాటు.. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీల భవిష్యత్తు గురించి ప్ర‌శ్న‌లు కురిపించాడు. ఈ సీజ‌న్ లో సోనమ్ కపూర్ రక్షా బంధన్ స్పెషల్ ఎపిసోడ్ లో తన సోదరుడు అర్జున్ కపూర్ ను ట్రోల్ చేసేంతగా ర‌క‌ర‌కాల జ‌వాబుల‌తో ఉక్కిరి బిక్కిరి చేసింది. సోద‌ర‌సోద‌రీమ‌ణులు ఇద్ద‌రూ ఎపిసోడ్ లో నిజాయితీగా ఉల్లాసంగా గడిపారు. తాజా ఎపిసోడ్ 'పంజాబీ ముండా' స్పెషల్ అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో ఇద్ద‌రు పంజాబీ యువ‌ హీరోలు క‌నిపించారు.

విక్కీ కౌశల్ - సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో ఫ‌న్నీ చాటింగ్ తో అల‌రించారు. కత్రినాతో డేటింగ్ చేసిన తర్వాత విక్కీకి కాఫీ విత్ క‌ర‌ణ్ లో ఇది మొదటి ఎపిసోడ్ అయితే.. ఈసారి సిద్ జీవితం గురించి ల‌వ్ లైఫ్ గురించి క‌ర‌ణ్‌ కొన్ని కీల‌క‌ వ్యాఖ్యలు చేసాడు. సిధ్ ని కియ‌రా అద్వాణీ గురించి ప్ర‌శ్నించారు.

ప్రోమోలో విక్కీ కౌశల్ -సిద్ధార్థ్ మల్హోత్రా వారి పంజాబీ జీన్స్ గురించి చ‌ర్చ సాగింది. విక్కీ గ‌తంలో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌నిపించాడు. అత‌డితో చివరి ఎపిసోడ్ 2018లో విడుదలైంది. అతను కత్రినా కైఫ్ తో ల‌వ్ లైఫ్ గురించి మాట్లాడాడు. అదే సీజన్ లో కత్రినా కూడా విక్కీ గురించి మాట్లాడింది. ఈ జంట డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు కేజేవో తో సీజ‌న్ 7 తాజా ఎపిసోడ్ లో సిద్ధార్థ్ - కియారా డేటింగ్ చేస్తున్నట్లు కరణ్ ధృవీకరించారు. ఇప్పుడు మీరు కియారా అద్వానీతో డేటింగ్ చేస్తున్నారు.. ఏదైనా వివాహ ప్రణాళిక ఉందా? అని సిధ్ ని క‌ర‌ణ్ ప్ర‌శ్నించాడు. దానికి అత‌డు స్పందిస్తూ -''నేను ఈ రోజు మానిఫెస్ట్ చేస్తున్నాను...'' అంటుండ‌గా.. అతడి మాట‌ పూర్తి కాక‌ముందే కరణ్ అడ్డగించి ''నువ్వు కియారా అద్వానీని పెళ్లి చేసుకుంటావు'' అని అన్నాడు. కానీ సిద్ ఆ వ్యాఖ్యకు 'క్షమించండి' అని రిప్ల‌య్ ఇచ్చాడు. కరణ్ ''యే బడా బిబా ముండా హై'' అని అన‌డం ప్రోమోలో ఫ‌న్ ని ఎలివేట్ చేసింది.

రాపిడ్ ఫైర్ రౌండ్ సమయంలో విక్కీ ఒంటరిగా ఉండటం గురించి అత‌డ‌ ఏమి మిస్ అవుతున్నాడో అని కూడా ప్ర‌శ్నించారు. దానికి స్పందిస్తూ.. అదృష్టవశాత్తూ ఇప్పుడు నా మిస్సస్.. అని అన్నాడు. అతని సమాధానం అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేసింది. షో ఆద్యంతం రంజుగా సాగ‌నుంద‌ని ఈ ప్రోమో వెల్ల‌డించింది. కాఫీ విత్ కరణ్ 7 డిస్నీ+హాట్ స్టార్ లో ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు ప్రీమియర్ అవుతుంది.