Begin typing your search above and press return to search.

అలా హీరోను వీర్యం అడిగేసిందట!

By:  Tupaki Desk   |   15 Sep 2018 5:30 PM GMT
అలా హీరోను వీర్యం అడిగేసిందట!
X
బాలీవుడ్ లో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా పేరు మనం తప్పని సరిగా చెప్పుకోవాలి. 'విక్కీ డోనార్' అనే సినిమాలో వీర్య దానం చెసే యువకుడి పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమాలో అంగస్థంభన విషయంలో ఇబ్బంది పడే భర్త పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆయుష్మాన్ రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

'విక్కీ డోనార్' సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో ఆయుష్మాన్ తన అమ్మ గారితో కలిసి ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళాడట. అక్కడ ఒక అమ్మాయి "నీ వీర్యం నాకు ఇస్తావా?" అని గట్టిగా అరిచిందట. ఆ అరుపుతో షాక్ అయిన వాళ్ళమ్మగారు.. "బేటా.. నువ్వేమైన చేశావా?" అని ఆయుష్మాన్ ను అడిగారట. అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు తనకు ఒక గే క్యాస్టింగ్ డైరెక్టర్ తో ఆడిషన్ సమయంలో మరో ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురైందని తెలిపాడు. పురుషాంగాన్ని చూపించమని క్యాస్టింగ్ డైరెక్టర్ అడిగాడట. షాక్ అయ్యి అతనికి 'నో' చెప్పానని అన్నాడు.

డిఫరెంట్ సినిమాలు చేయడమే కాదు ఈ హీరో కు ఏ హీరోకు లేనటువంటి డిఫరెంట్ అనుభవాలు ఉన్నాయి. ఏదేమైనా అలాంటి అనుభవాలను ఓపెన్ గా చెప్పడం అభినందించాల్సిన విషయమే.