Begin typing your search above and press return to search.

'విరాట పర్వం' ఆ చిత్రాల జాబితాలో చేరిపోయేనేమో

By:  Tupaki Desk   |   21 March 2021 2:30 PM GMT
విరాట పర్వం ఆ చిత్రాల జాబితాలో చేరిపోయేనేమో
X
రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వారి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని తాజాగా విడుదలైన టీజర్ ను బట్టి అర్థం అవుతోంది. ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చ మరియు టీజర్ విడుదల తర్వాత విప్లవ సినిమాలను ఇష్టపడే సీనియర్ ప్రేక్షకులను మాత్రమే ఈ సినిమా ఆకట్టుకుంటుందేమో అంటున్నారు. యూత్‌ ఆడియన్స్ ఈమద్య కాలంలో ప్రేమ కథలు పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కథలను మాత్రమే ఆధరిస్తున్నారు.

ఇలాంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. విమర్శకుల ప్రశంసలు దక్కినా కూడా వసూళ్లు నామమాత్రంగానే వచ్చే అవకాశం ఉందంటున్నారు. గతంలో ఎన్నో సినిమాలు టాక్ పరంగా సూపర్‌ హిట్‌ అనిపించుకున్నా కమర్షియల్‌ గా నిరాశ పర్చాయి. ఇటీవల వచ్చిన శ్రీకారం సినిమా కూడా పాజిటివ్ టాక్ దక్కించుకుని వసూళ్ల పరంగా నిరాశ పర్చింది. ఆర్ట్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆధరించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కనుక విరాట పర్వం సినిమా కూడా ఆర్ట్ సినిమాల జాబితాలో చేరుతుందేమో అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కమర్షియల్ గా ఎలా ఉన్నా సినిమాలో నటించిన వారందరికి మరియు టెక్నికల్‌ టీమ్‌ కు మంచి ప్రశంసలు మాత్రం దక్కుతాయని అంటున్నారు.