Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కన్ను రౌడీహీరోపై పడిందా?

By:  Tupaki Desk   |   21 March 2019 10:58 AM IST
బిగ్ బాస్ కన్ను రౌడీహీరోపై పడిందా?
X
బిగ్ బాస్ రియాలిటీ షో ఇతర భాషలలోనే కాదు తెలుగులో కూడా ఇప్పుడు క్రేజీ రియాలిటీ షోనే. మొదటి సీజన్లో ఎన్టీఆర్.. రెండో సీజన్లో నాని హోస్ట్ గా వ్యవహరించగా మూడో సీజన్ హోస్ట్ ను ఫైనలైజ్ చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొదట ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.. తర్వాత నాగార్జున అన్నారు.. తాజాగా ఈ లిస్టులోకి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు.

నాగార్జునను సంప్రదించినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయని.. అందుకే బిగ్ బాస్ అసైన్మెంట్ టేకప్ చేసే విషయంలో ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో బిగ్ బాస్ ఆర్గనైజర్లు విజయ్ దేవరకొండను సంప్రదించారట. కానీ విజయ్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దీంతో తనకు బిగ్ బాస్ కోసం డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నాడట. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఎలాగైనా రౌడీ స్టార్ ను బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి విజయ్ బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సూట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో తన రౌడీ యాటిట్యూడ్ తో అందరి దృష్టిని ఆకర్షించే రౌడీగారు హోస్ట్ గా మారితే బిగ్ బాస్ మరింత స్పైసీగా మారుతుందనడంలో ఏమాత్రం అనుమనం లేదు.