Begin typing your search above and press return to search.

`నారప్ప`గా వెంకీ మ‌రోసారి మ్యాజిక్ చేస్తారా?

By:  Tupaki Desk   |   13 Dec 2020 7:11 AM GMT
`నారప్ప`గా వెంకీ మ‌రోసారి మ్యాజిక్ చేస్తారా?
X
విక్ట‌రీ వెంక‌టేష్ మాస్ అప్పీల్.. ఎమోష‌నల్ పెర్ఫామెన్స్ తో నార‌ప్ప మ‌రో సెన్సేష‌న్ కాబోతోందా? అంటే అవున‌నే అభిమానులు భావిస్తున్నారు. వాసు.. గ‌ణేష్ లాంటి చిత్రాల్లో వెంకీ ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ .. గురూ లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే న‌ట‌న‌తో విక్ట‌రీ త‌న‌దైన శైలి పెర్ఫామ‌ర్ గా మెప్పించారు.

ఎఫ్‌2- వెంకీమామ జోన‌ర్ కి భిన్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుని ఆయ‌న న‌ట‌న‌తో రంజింప‌జేశారు. ఇప్పుడు వ‌స్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ మ‌రో సెన్సేష‌న్ అవుతుందా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. తాజాగా ఈ మూవీ నుండి `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప`పేరుతో టీజ‌ర్ ని విడుద‌ల‌చేయ‌గా ల‌క్ష‌లాది లైక్ ల‌తో టీజ‌ర్ వైర‌ల్ గా మారింది.

వెంకీ మాస్ అవ‌తార్ ఆక‌ట్టుకుంది. అలాగే క‌త్తి చేత‌ప‌ట్టి ఎమోష‌న్ చూపిస్తున్న విధానం ర‌క్తి క‌ట్టించింది. ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ చూపించి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ గ్లిమ్స్ ద్వారా ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ టీజ‌ర్‌ వెంక‌టేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా చెట్టుచాటు నుండి క‌త్తి ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తూ రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఉర్రూత‌లూగించింది. వెంక‌టేష్ సరికొత్త గెటప్.. బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాస్ లో మాంచి ఊపు తేవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక ధ‌ర్మ‌చ‌క్రం.. జ‌యం మ‌న‌దే రా త‌ర‌హాలో హై ఎమోష‌న్స్ కి ఆస్కారం ఉన్న స్క్రిప్ట్ కావ‌డంతో నార‌ప్ప‌పై అంచ‌నాలు ఆ స్థాయిలోనే క‌నిపిస్తున్నాయి. ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రం అసుర‌న్ రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ధ‌నుష్ పోషించిన పాత్ర‌ను తెలుగులో వెంకీ పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ రీరికార్డింగ్ సినిమాకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహంలేదు. ఈ టీజ‌ర్ ‌తో సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది చిత్ర యూనిట్‌. అంద‌రి అంచ‌నాల‌కు ధీటుగా ఈ చిత్రం రూపొందుతోంది. అనంత‌పురం షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్త‌య్యంది. నెక్స్ట్‌ షెడ్యూల్‌లో ఫ్లాష్ ‌బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించ‌నున్నారు. నార‌ప్ప గ్లింప్స్ అభిమానుల‌తో పంచుకోవడం గర్వంగా ఉందని వెంకీ అన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు- కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నార‌ప్ప స‌తీమ‌ణి సుంద‌ర‌మ్మ‌గా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి న‌టిస్తోంది. `నార‌ప్ప` పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా `కేరాఫ్ కంచరపాలెం`ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప` యూట్యూబ్‌లో నెం.1లో ట్రెండ్ అవుతోంది.