Begin typing your search above and press return to search.

ఈట‌ల వెన్నుపోటుపై వ‌ర్మ సినిమా తీస్తారా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 10:11 AM IST
ఈట‌ల వెన్నుపోటుపై వ‌ర్మ సినిమా తీస్తారా?
X
నిరంత‌రం వివాదాస్ప‌ద అంశాల‌తో సినిమాలు తీసేందుకు రెడీ అయ్యే రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త కొంత‌కాలంగా ట్విట్ట‌ర్ కామెంట్ల‌కే ప‌రిమితం అయిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు డీ కంపెనీ నాయిక‌ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తూ .. ఇంట‌ర్వ్యూల పేరుతో యాంక‌ర్ల‌తో ప‌రాచికాలు ఆడుతూ ఆర్జీవీ చేస్తున్న హంగామా చూస్తున్న‌దే.

తాజాగా ఆర్జీవీ రెండు టాపిక్ ల‌పై మ‌రో సారి లైమ్ లైట్ లో కి వ‌చ్చారు. అందులో మొద‌టి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల‌పై ఆర్జీవీ సెటైర్. సినీ MAA ఈజ్ ఏ CIRCUS ఫుల్ ఆఫ్ JOKERS అంటూ ఆర్జీవీ వేడెక్కించే కామెంట్ ని చేశారు. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఉన్న‌వారంతా జోక‌ర్లు అని స‌ర్క‌స్ ఫీట్స్ వేస్తున్నార‌ని ఆర్జీవీ డైరెక్ట్ గానే విమ‌ర్శించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా `మా` అసోసియేష‌న్ వ్య‌వ‌హారాల్ని పరిశీలిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు ఆగ‌లేక అదిరే పంచ్ విసిరాడు.

ఈలోగానే ఆర్జీవీని ఒక అభిమాని ఏమ‌ని ప్ర‌శ్నించారంటే కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తెలంగాణ‌ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ జీవిత‌క‌థ‌తో సినిమా తీస్తున్నార‌ట..! నిజ‌మేనా? అని ప్ర‌శ్నించారు. ``రామ్ గోపాల్ వర్మ గారు ఇది నిజమేనా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నారు. ఇది కరెక్టు కాదని నేను అనుకుంటున్నాను!`` అంటూ దణ్ణం పెడుతున్న ఈమోజీని షేర్ చేశాడు.

నాకెందుకో ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్ కు వెన్నుపోటు ... ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు వెన్నుపోటు సేమ్ అనిపించింది. ఈ ఎపిసోడ్ పై తెలంగాణ నాయ‌కుల్ని క‌నుక్కుని సినిమా తీస్తా! అంటూ వ‌ర్మ ట్వీట్ చేసిన ఓ ఇమేజ్ ని స‌ద‌రు అభిమాని షేర్ చేశారు. ఈ సినిమా పేరు `వెన్నుపోటు ఈట‌ల` అంటూ పోస్ట‌ర్ ని వేయ‌డం ఆస‌క్తిక‌రం. ఈ మార్ఫ్ డ్ ఇమేజ్ పోస్ట‌ర్ లో కేసీఆర్ బాహుబ‌లి అయితే వెన్నుపోటు పొడిచే క‌ట్ట‌ప్ప‌గా ఈట‌ల క‌నిపించారు. అన్న‌ట్టు ఆర్జీవీ ఏ సినిమా చేసినా అది రిలీజ్ కి రావ‌డం లేదు. ఇలాంట‌ప్పుడు మ‌రో సినిమా తీస్తార‌ని అంటారా? తీసినా రిలీజ‌వుతుందంటారా?