Begin typing your search above and press return to search.

47,530.. వర్మ దంగల్ రికార్డు బద్దలు కొట్టేనా ఏంటీ?

By:  Tupaki Desk   |   13 July 2022 8:30 AM GMT
47,530.. వర్మ దంగల్ రికార్డు బద్దలు కొట్టేనా ఏంటీ?
X
ఇండియన్ సినిమా లు చైనాలో రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈమద్య కాలంలో భారత్.. చైనాల మధ్య గొడవలు ఉన్న కారణంగా అక్కడ మన సినిమాలు అసలు విడుదల అవ్వడమే గగనంగా మారింది. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన దంగల్ చైనాలో భారీ వసూళ్లు దక్కించుకుని రికార్డు స్థాయిలో నిలిచింది.

దంగల్ కేవలం చైనా లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దంగల్ సినిమా చైనాలో దాదాపుగా 9 వేల థియేటర్లలో విడుదల అయినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు వర్మ సినిమా అమ్మాయి సినిమా అంతకు నాలుగు అయిదు రెట్లు అధిక థియేటర్లలో విడుదలకు సిద్దం అయ్యింది. వర్మ దర్శకత్వంలో రూపొందిన అమ్మాయి సినిమా ను చైనాలో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చైనా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ తో రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 47530 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా వర్మ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ఒక సినిమా దాదాపుగా 50 వేల స్క్రీన్స్ లో విడుదల అవ్వడం ఎలా సాధ్యం వర్మ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.. వర్మకు లక్ష స్క్రీన్స్ అయినా సాధ్యమే అంటూ కామెంట్స్ చేసే వారు లేక పోలేదు.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిందే. అయినా కూడా ఆయన సినిమా వస్తుందంటే ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కమర్షియల్ గా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కాని ఈ సినిమా మాత్రం ఏదో అద్భుతం ను ఆవిష్కరించబోతుందేమో అంటూ కొందరు నమ్మకంతో ఉన్నారు.

ఇండియాలో ఈ సినిమా ఆడినా ఆడకున్నా కూడా చైనాలో మాత్రం ఈ సినిమా కుమ్మేయడం ఖాయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఇండియాస్ ఫస్ట్‌ మార్షల్‌ ఆర్ట్స్ ఫిల్మ్‌ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. వివిధ భాషల్లో వివిధ టైటిల్స్ తో ఈ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు.

50 వేల స్క్రీన్స్‌ లో సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే దంగల్ రికార్డును కూడా రామ్‌ గోపాల్ వర్మ రికార్డు ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. వర్మ దంగల్‌ రికార్డ్‌ ను బ్రేక్ చేస్తే ఖచ్చితంగా అది సంచలనమే.