Begin typing your search above and press return to search.

వేణు `ఐక‌న్` బ‌న్నితోనేనా? వేరే హీరోతోనా?

By:  Tupaki Desk   |   11 April 2021 2:30 PM GMT
వేణు `ఐక‌న్` బ‌న్నితోనేనా? వేరే హీరోతోనా?
X
ప్ర‌తిభ‌కు గీటు రాయి ఏదీ? అంటే రంగుల ప‌రిశ్ర‌మ‌లో హిట్టు ఒక్క‌టే గీటురాయి. కానీ ఇటీవ‌లి కాలంలో ఆ హిట్టు కూడా స‌రిపోవ‌డం లేదు. బంప‌ర్ హిట్టు కొట్టాలి. వ‌రుస‌గా హిట్లు కొట్టి నిరూపించాలి. అందుకోసం హిట్టు కొట్టిన ద‌ర్శ‌కుడు కూడా ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆల్రెడీ ప్ర‌క‌టించిన ప్రాజెక్టు కోస‌మే క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూడాల్సి వ‌స్తోందంటే నేడు మారిన స‌న్నివేశం ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇంత‌కుముందు `ఓ మై ఫ్రెండ్`తో ఫెయిలైనా ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాతో హిట్టు కొట్టాడు వేణు శ్రీ‌రామ్. అవి రెండూ దిల్ రాజు కాంపౌండ్ సినిమాలే. ఆ వెంట‌నే బ‌న్నితో వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడిగా ఐక‌న్ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌లోనే బ‌న్ని ఎందుక‌నో పున‌రాలోచ‌న‌లో ప‌డ‌డంతో ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. ఐక‌న్ ప్ర‌యోగాత్మ‌క క‌థాంశం. బ‌న్నికి బాగా న‌చ్చేసింది. అయినా ఇంకేదో డైల‌మా.

ఆ క్ర‌మంలోనే వేణు శ్రీ‌రామ్ మ‌రో ప‌రీక్ష‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఈసారి ఒక రీమేక్ సినిమాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కి విజ‌యం అందించాలి. ఆల్రెడీ హిందీ.. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన చిత్రానికి తెలుగు రీమేక్. అయినా ఛాలెంజింగ్ గా తీసుకుని నేడు వ‌కీల్ సాబ్ రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడు వేణు శ్రీ‌రామ్. ఈ స‌క్సెస్ తో అన్ని క‌ళ్లు అత‌డిపైనే. త‌మ్ముడు ప‌వ‌న్ కి హిట్టిచ్చినందుకు ఏదైనా రీమేక్ కోసం చిరంజీవి వేణు శ్రీ‌రామ్ తో జ‌త‌క‌డ‌తార‌ని ప్ర‌చారం సాగిపోతోంది.

ఈలోగానే బ‌న్నితో ఐక‌న్ ని రీస్టార్ట్ చేస్తార‌న్న టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఒక‌వేళ బ‌న్ని ఈ సినిమా చేయ‌క‌పోయినా కానీ వేణు శ్రీ‌రామ్ కి వేరొక హీరోని సెట్ చేయాల‌ని దిల్ రాజు ఆలోచిస్తున్నార‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇక బ‌న్ని ప్ర‌స్తుతం పుష్ప చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి వేణు శ్రీ‌రామ్ తో నే సెట్స్ కెళ‌తారా? అన్న‌ది వేచి చూడాలి. వ‌కీల్ సాబ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి నిరూపించుకున్న వేణు శ్రీ‌రామ్ ఐక‌న్ పూర్తి స్క్రిప్టుతో సంసిద్ధంగా ఉన్నారు. ఇది యూనివ‌ర్శ‌ల్ ఆడియెన్ కి స‌రిప‌డే కథాంశ‌మే. మ‌రి బ‌న్ని సంసిద్ధంగా ఉన్నారా లేదా? అన్న‌దే వేచి చూడాల్సి ఉంటుంది. 2011లో కెరీర్ ప్రారంభించిన వేణు శ్రీ‌రామ్ ప‌దేళ్ల‌లో కేవ‌లం మూడు సినిమాలకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అత‌డు ఒక టైల‌ర్ కొడుకు. వ‌కీల్ సాబ్ స‌క్సెస్ ని చూసేందుకు త‌న తండ్రి లేర‌ని వేణు శ్రీ‌రామ్ కంట త‌డి పెట్టుకున్న తీరు హృద‌యాన్ని క‌దిలించింది. ఇప్పుడు బ‌న్ని త‌నకు కెరీర్ నాలుగో సినిమాని ఇస్తారా లేదా? అన్న‌ది వేచి చూడాలి.