Begin typing your search above and press return to search.

తారకరత్నకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   26 May 2022 11:30 AM GMT
తారకరత్నకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తాడా?
X
నందమూరి వారసులలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే నందమూరి వారసత్వంను పాన్ ఇండియా వరకు తీసుకు రావడం మెచ్చుకో దగిన విషయం. ఇక మరొక వైపు కళ్యాణ్ రామ్ కూడా పరవాలేదనిపించే విధంగా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

అయితే ఒకప్పుడు తారకరత్న కూడా స్టార్ హీరో అవ్వాలని గట్టిగానే ప్లాన్ చేశాడు. అతని కెరీర్ మొదలైనప్పుడు ఫస్ట్ సినిమా విడుదల కాకముందే వరుసగా ఏడు సినిమాలను లాక్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తారకరత్న హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఒక విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. అయితే కొంతకాలం తర్వాత నటుడిగా మాత్రం మంచి గుర్తింపును అనుకున్నాడు. ఆ మధ్య రవిబాబు దర్శకత్వంలో చేసిన అనసూయ సినిమా లో విలన్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో ఏదో ఒక విధంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పూర్తి స్థాయిలో మాత్రం తారకరత్న ఇండస్ట్రీలో కొనసాగడం లేదు. ప్రస్తుతం అతనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే అందులో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం ఆ మధ్య మీడియం రేంజ్ హీరోలను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచించినట్లు టాక్ వచ్చింది. సుధీర్ బాబు నాని ఇలా కొంత మంది పేర్లు కూడా వినిపించాయి.

ఇక అలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా కూడా ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తారకరత్న పేరు కూడా చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం.త్రివిక్రమ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

అవకాశాలు లేక దాదాపు ఇండస్ట్రీకి దూరమైన తారకరత్నకు మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.