Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఆ సెన్సేషనల్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా...?

By:  Tupaki Desk   |   30 April 2020 11:30 AM IST
సూపర్ స్టార్ ఆ సెన్సేషనల్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా...?
X
'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ లోను సందీప్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నాడు సందీప్ వంగా. దీనికి సంబందించి వీరి మధ్య చర్చలు జరిగాయని.. వీరి కాంబినేషన్ లో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. కానీ టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. 'అర్జున్ రెడ్డి' సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ‘కబీర్ సింగ్’ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో సందీప్ వంగా ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవంట. దీంతో సందీప్ వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక కథ చెప్పాడన.. ఆ కథ ఆసక్తి కరంగా ఉండడం తో ప్రభాస్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారేనని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడట. దీనికోసం ఇప్పటికే రెడీగా ఉన్న స్క్రిప్ట్ తో మహేష్ ని కన్విన్స్ చేయాలని అనుకుంటున్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మహేష్ ని కలిసి స్టోరీ నారేట్ చేయబోతున్నాడట. అయితే ఇప్పటికే ఒకసారి ఓకే అనుకున్న ప్రాజెక్ట్ దూరమయింది. మరి ఇప్పుడయినా వీరి కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి. కాకపోతే మహేష్ బాబు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండే అవకాశాలున్నాయి. కుదిరితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలో మరో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సందీప్ చెప్పే స్క్రిప్ట్ నచ్చితే మహేష్ ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో సినిమా క్యాన్సిల్ అవలేదని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ - సందీప్ వంగా కాంబో సెట్ అవుద్దో లేదో చూడాలి.