Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ క‌స‌ర‌త్తులుః సినిమా రాముడికి సిక్స్ ప్యాక్ ఉంటుందా..?

By:  Tupaki Desk   |   19 March 2021 5:45 AM GMT
ప్ర‌భాస్ క‌స‌ర‌త్తులుః సినిమా రాముడికి సిక్స్ ప్యాక్ ఉంటుందా..?
X
ప్ర‌భాస్ ఇప్పుడు ఓ నేష‌న‌ల్ స్టార్‌. బాహుబ‌లి త‌ర్వాత మునుపెన్న‌డూ లేనంత బిజీగా మారిపోయింది ఆయ‌న క్యాలెండ‌ర్‌. ఇంట్లో కార్య‌క్ర‌మాలు కూడా షెడ్యూల్ చూసి ప్లాన్ చేయాల్సినంత టైట్ గా ఉన్నాయి ఆయ‌న డేట్స్‌. అప్ క‌మింగ్ మూవీ రాధేశ్యామ్ ను ఫినిష్ చేసిన ప్ర‌భాస్‌.. మిగిలిన మూడు చిత్రాల‌పై దృష్టి పెట్టాడు.

ప్ర‌శాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే 2022 స‌మ్మ‌ర్ లో స్లాట్ బుక్ చేసిన ద‌ర్శ‌కుడు.. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు ప‌క్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ కూడా ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇవి రెండూ కాకుండా మిగిలిన మూడో చిత్రం ‘ఆదిపురుష్’

ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ చిత్రం.. అనౌన్స్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూట్ కూడా కొన‌సాగుతోంది. ఈ మ‌ధ్య‌నే స‌లార్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్ర‌భాస్‌.. ఆదిపురుష్ టీమ్ తో క‌లిసిపోయేందుకు ముంబై వెళ్లిపోయాడు.

అయితే.. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తార‌న్న‌దే ఇప్పుడు అంద‌రిలోనూ నెల‌కొన్న ప్ర‌ధాన ఆస‌క్తి. రాముడి పాత్ర‌కు చిన్న వంక‌కూడా పెట్ట‌కుండా ఉండాలి. కాబ‌ట్టి, ఇందుకోసం ప్ర‌భాస్ తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ముందుగా బ‌రువు త‌గ్గేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఉద‌యం, సాయంత్రం జిమ్ లోనే గంట‌లు గంట‌లు గ‌డిపేస్తున్నాడు. మ‌రి, ప్ర‌భాస్ సిక్స్ ప్యాక్ రాముడిగా క‌నిపిస్తారా? అనే ఆస‌క్తి వ్య‌క్తంచేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇది తెలియాలంటే 2022 ఆగ‌స్టు 11 వ‌ర‌కు వెయిట్ చేయాలి.