Begin typing your search above and press return to search.

మ‌హేష్ ‌తో `ఒక్క‌డు` సీక్వెల్ తీస్తారా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 8:59 AM IST
మ‌హేష్ ‌తో `ఒక్క‌డు` సీక్వెల్ తీస్తారా?
X
ఎం.ఎస్‌.రాజు.. ఈయ‌న బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తోందంటే స‌మ్‌థింగ్‌ స్పెష‌ల్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్ర‌తియేటా సమ్మ‌ర్ సీజన్ లో ఈయ‌న సినిమా వ‌స్తోందంటే ఆ బ‌జ్ వేరుగా వుండేది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వ‌ర‌కు ఆయ‌న సినిమాల కార‌ణంగానే పాపుల‌ర్ అయ్యారు. `వ‌ర్షం`తో ప్ర‌భాస్‌.. `ఒక్క‌డు`తో మ‌హేష్‌.. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా?` తో సిద్ధార్ద్ ... త్రిష‌ స్టార్స్ ‌గా ఎదిగారు.

స‌మ్మ‌ర్ హిట్ చిత్రాల రాజుగా ముద్ర‌ప‌డిన ఆయ‌న కెరీర్ ‌లో ఎన్నో సూప‌ర్ హిట్‌లిచ్చారు. కానీ సీన్ మారింది. స‌మ్మ‌ర్ హిట్ చిత్రాల రాజు కాస్తా ఫ్లాపుల రాజుగా మారిపోయారు. కొంత విరామం త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మారి రూపొందించిన `డ‌ర్టీ హ‌రి`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదల‌వుతోంది.

ఈ మూవీ త‌న‌కు క‌మ్‌ బ్యాక్ ఫిల్మ్ అవుతుంద‌ని ఎం.ఎస్‌. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు‌. మ‌ళ్లీ త‌న సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ‌ని ఘ‌నంగా రీలాంచ్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ బ్యాన‌ర్ ‌లో త్వ‌ర‌లో సినిమాల నిర్మాణం ప్రారంభిస్తాని ‌మ‌హేష్ తో మళ్లీ సినిమా చేస్తాన‌ని అంటున్నారు ఎం.ఎస్‌. రాజు. ఒకవేళ మ‌హేష్ తో సినిమా చేస్తే ఒక్క‌డు సీక్వెల్ తీస్తారా? మారిన ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు పెద్ద స్కేల్ లో ఈ మూవీ ఉంటుందా? అంటూ మ‌హేష్ అభిమానుల్లో ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.