Begin typing your search above and press return to search.
ఈ నెలలో కొత్త బొమ్మ పడేనా?
By: Tupaki Desk | 12 July 2021 7:18 PM ISTగత ఏడాది మార్చిలో మూత పడ్డ థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి దాదాపుగా పది నెలల సమయం పట్టింది. రెండు నెలలు పూర్తి స్థాయిలో థియేటర్లు నడిచాయో లేదో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూత పడ్డాయి. దాదాపుగా నాలుగు నెలల నుండి థియేటర్లలో బొమ్మ పడిందే లేదు. ఈ నెల లో అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లకు అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంక్షలు ఏమీ లేవన్నట్లుగా స్పందించింది.
జులై నెలలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే కొత్త సినిమాలు ఈ నెలలో విడుదల అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి రెండు చిన్న సినిమాలు జులై చివరి వారంలో విడుదల కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏదోలా విడుదల చేసి.. ఆ తర్వాత ఓటీటీకి వెళ్లాలి అనేది ఆ సినిమా మేకర్స్ ప్రయత్నంగా ఇండస్ట్రీ వర్గాల టాక్. కాని ఆ సినిమా ల విడుదల విషయంలో కూడా స్పష్టత కరువయ్యింది.
థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల థియేటర్ల అసోషియేషన్ నుండి క్లారిటీ లేదు. వారు టికెట్ల రేట్లు పెంపు తో పాటు పలు కండీషన్స్ ను పెడుతున్నారు. కనుక బొమ్మ పడాలంటే ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు వారు కోరుకునే వెసులుబాటు కల్పించాల్సి ఉంటుందట. మరి ప్రభుత్వాలు అందుకు ఓప్పుకోకుంటే మాత్రం జులై లో బొమ్మ పడటం కష్టమే అంటే ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆగస్టులో పలు సినిమా లు విడుదల కావాలనుకుంటున్నాయి. మరి వచ్చే నెలకు అయినా ఛాన్స్ దక్కేనా చూడాలి.