Begin typing your search above and press return to search.

12 పీఎం స‌మావేశంలో టికెట్ జాత‌కం మారుతుందా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 11:16 AM IST
12 పీఎం స‌మావేశంలో టికెట్ జాత‌కం మారుతుందా?
X
ఏపీలో టికెట్ ర‌గ‌డ గురించి తెలిసిందే. స‌మ‌స్య అంతకంత‌కు ఝ‌టిలం అవుతోందే కానీ మెరుగుప‌డ‌డం లేదు. సీఎంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు దూరం జరిగాయే కానీ ద‌గ్గ‌ర‌వ్వ‌లేదు. ఎంత‌గా ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకుంటే అంత‌గా దూరం అవుతున్న స‌న్నివేశం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు హీరోలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ప‌వ‌న్ క‌ల్యాన్ - నాని- సిద్ధార్థ్ లాంటి హీరోలు నేరుగానే ఏపీ ప్ర‌భుత్వంపై ఎటాక్ చేయ‌డంతో అది కాస్తా ర‌చ్చ‌య్యింది. అక్క‌డికీ కొంద‌రు సీఎం గొప్ప‌త‌నాన్ని పొగిడేసే ప్ర‌య‌త్నం చేసినా కానీ ఇక ప‌న‌వ్వ‌ద‌న్న టాక్ వినిపించింది.

అయితే మంత్రి పేర్ని నాని ఇంత‌లోనే 11 మంది స‌భ్యుల‌తో క‌మిటీని వేసి రాష్ట్రంలోని టికెట్ రేట్ల‌ను స‌మీక్షించాల‌ని భావించ‌డంతో కొంత‌వ‌ర‌కూ న‌మ్మ‌కం పెరిగింది. తాజా స‌మాచారం మ‌ర‌కు..హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి విశ్వ‌జీత్ స‌మ‌క్షంలో వీడియో స‌మావేశంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు చ‌ర్చించ‌నున్నారు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు సినీపెద్ద‌లు ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై జ‌గ‌న్ ని అభ్య‌ర్థించారు. స‌మ‌యానుకూలంగా పెద్ద సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ల్ని పెంచాల‌ని కోరారు. దీనికి అనుకూలంగానే హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స‌మ‌క్షంలో సాగే స‌మావేశంలో టికెట్ రేట్ల అంశం ఒక కొలిక్కి వ‌స్తుంద‌నే ప‌రిశ్ర‌మ ఆశిస్తోంది. ఈ సంక్రాంతి సీజ‌న్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. జ‌న‌వ‌రి 7న ఆర్.ఆర్.ఆర్ రిలీజ‌వుతోంది.

అంత‌కుముందే టిక్కెట్ రేట్లు పెంచే యోచ‌న చేస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ -రానా ల భీమ్లా నాయ‌క్.. ప్ర‌భాస్ రాధేశ్యామ్ అజిత్ వాలిమై లాంటి చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇవ‌న్నీ భారీ సినిమాలు. వీటికి ప్ర‌స్తుత టికెట్ రేట్ల‌తో గిట్టుబాటు కాని ప‌రిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు టికెట్ ధ‌ర‌ల పెంపుద‌ల చాలా అత్యావ‌శ్య‌కం అని ఎగ్జిబిష‌న్ స‌హా పంపిణీ వ‌ర్గాలు ఆవేదేన చెందుతున్నాయి. నేటి స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు? టికెట్ జాత‌కం మారుతుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.