Begin typing your search above and press return to search.

అభిమానుల కోరిక సూపర్ స్టార్ తీరుస్తాడా లేదా?

By:  Tupaki Desk   |   10 April 2020 1:00 PM GMT
అభిమానుల కోరిక సూపర్ స్టార్ తీరుస్తాడా లేదా?
X
టాలీవుడ్ స్టార్లు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. అయితే తెలుగులో చాలా పెద్ద స్టార్ అయిన మహేష్ బాబు మాత్రం ఇంతవరకూ అలాంటి ఆలోచన చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాదు మహేష్ అభిమానులు కూడా ఈ విషయంలో తమ హీరో వెనకబడి ఉన్నారని అంటున్నారు. సూపర్ స్టార్ కూడా పాన్ ఇండియా సినిమా చెయ్యాలని వారు కోరుతున్నారు.

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు తప్ప అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఇద్దరూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' తో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' తో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హీరోలే కాదు యువ హీరో విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాధ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కు గురి పెట్టాడు.

ఇలా అందరూ తెలుగు రాష్ట్రాలు.. సౌత్ ను దాటి దేశవ్యాప్తంగా తమ మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మహేష్ బాబు మాత్రం ఆ దిశగా ఆలోచించకపోవడం అభిమానులను ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. రెగ్యులర్ మసాలా సినిమాలను కొంతకాలం పక్కనబెట్టి యూనివర్సల్ అప్పీల్ ఉండేకథతో సూపర్ స్టార్ కూడా పాన్ ఇండియా సినిమాను టేకప్ చెయ్యాలని.. ఇదే అందుకు సరైన సమయమని అభిమానులు మహేష్ ను కోరుతున్నారు.

నిజానికి మహేష్ తెలుగు సినిమాలు తప్ప ఇతర భాషలలో నటించకపోయిన నార్త్ లో క్రేజ్ ఉందని.. బాలీవుడ్ లో కూడా మహేష్ కు అభిమానులు ఉన్నారని.. పైగా మహేష్ లుక్స్ కూడా తెలుగు హీరోలా కాకుండా బాలీవుడ్ హీరోలా ఉంటాయని అభిమానులు చెప్తున్నారు. మరి అభిమానుల మనసులో ఉన్న ఆలోచనలను సూపర్ స్టార్ వింటున్నారో లేదో!