Begin typing your search above and press return to search.

బుల్లితెరపై కేజీఎఫ్.. ఇంకా ఆ క్రేజు ఉందంటారా?

By:  Tupaki Desk   |   2 July 2020 10:00 AM IST
బుల్లితెరపై కేజీఎఫ్.. ఇంకా ఆ క్రేజు ఉందంటారా?
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన `కేజీఎఫ్` ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై విజ‌య్ కిరంగ‌దుర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు. ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 380కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. క‌న్న‌డ సినిమా హిస్ట‌రీలోనే ఇది అసాధార‌ణ‌మైన సినిమాగా రికార్డుల‌కెక్కింది. ఇక హిందీలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమాకి తెలుగులోనూ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 (సీక్వెల్ కాని క‌థ‌) సెట్స్ పై ఉంది. అంతా స‌వ్యంగా సాగితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన‌ది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల అంత‌కంత‌కు వాయిదా ప‌డుతూనే ఉంది. ఇక‌పోతే ఇన్నాళ్ల త‌ర్వాత కేజీఎఫ్ ప్రీమియ‌ర్ బుల్లితెర వీక్ష‌కుల్లో సంద‌డి నింప‌నుంది. రెండేళ్ల గ్యాప్ అనంత‌రం ఈ జూలై 5 (ఆదివారం)న కేజీఎఫ్ - చాప్ట‌ర్ 1 టెలివిజన్ ప్రీమియర్ కి రావ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే ఈ ప్రీమియ‌ర్ కి టీఆర్పీ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది హాట్ టాపిక్. ఇన్నాళ్లు ఓటీటీ వేదిక‌ల‌పై ఈ సినిమా అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది చూసేశారు. లాక్ డౌన్ వ‌ల్ల అంద‌రికీ టైమ్ దొరికింది. ప్ర‌తి ఒక్క‌రూ ఓటీటీల‌కు క‌నెక్ట్ అయ్యి ఉండ‌డంతో ఇప్ప‌టికే కేజీఎఫ్ చిత్రాన్ని పెద్ద తెర‌పై చూడ‌ని వారు వీక్షించారు. ఇలాంటి టైమ్ లో ఈ మూవీని టీవీ ప్రీమియ‌ర్ వేస్తే చూసేవాళ్లు ఉంటారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత గ్యాప్ త‌ర్వాత కూడా కేజీఎఫ్ ప్రీమియ‌ర్ కి టీఆర్పీ బావుంటే క‌చ్ఛితంగా సీక్వెల్ కి అది ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఇంకా ఈ ఫ్రాంఛైజీపై జ‌నాల్లో క్రేజు ఉంద‌నే అర్థం చేసుకోవ‌చ్చు. అన్నిటికీ ఈ ఆదివారం ప్రీమియ‌ర్ తో స‌మాధానం ల‌భిస్తుందేమో! ఓటీటీలు.. పైర‌సీల్లో ఇప్ప‌టికే ఈ మూవీని వీక్షించిన వాళ్లు మ‌రోసారి బుల్లితెర‌పైనా వీక్షించే వీలుందంటారా?