Begin typing your search above and press return to search.

హృతిక్ రోషన్ తో ఆ సినిమా రీమేక్ చేస్తా: అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   10 March 2021 8:00 AM IST
హృతిక్ రోషన్ తో ఆ సినిమా రీమేక్ చేస్తా: అనిల్ రావిపూడి
X
'గాలి సంపత్' సినిమాతో ప్రొడ్యూసర్ అవతారమెత్తిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఆ సినిమా మార్చి 11న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో సినిమా చేయాలనే కోరికను కూడా బయటపెట్టడంతో పాటుగా మహేష్ - బాలయ్య - రామ్ లతో చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు.

''ఎఫ్-2 సినిమా ఆల్రెడీ హిందీలో రీమేక్ అవుతోంది. అవకాశం వస్తే బాలీవుడ్‌ లో హృతిక్ రోషన్ తో ‘పటాస్‌’ సినిమాను రీమేక్‌ చేయాలని ఉంది. దానికి టైంతో పనిలేదు. కరెక్టుగా ట్రీట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుంది. హృతిక్ అంత బాడీ పెట్టుకొని అలాంటి సెటప్ సినిమా చేయట్లేదు. అంత కటౌట్ ఉండి ఆయన వేరే వేరే సినిమాలు చేస్తున్నాడు. హృతిక్‌ తో పటాస్ లాంటి మసాలా సినిమాలు తీయాలి. అలాంటి సినిమాలు చేస్తే ఆయనకూ కొత్తగా ఉంటుంది'' అనిల్ చెప్పుకొచ్చారు.

''రామ్ తో ఎప్పట్నుంచో సినిమా అనుకున్నాను. కానీ కుదరలేదు. త్వరలో రామ్‌ తో ఒక సినిమా చేస్తా. అలాగే బాలకృష్ణకి కూడా స్టోరీ లైన్‌ చెప్పా. ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలి. మహేష్‌ తో కూడా ఒక సినిమా త్వరలో ఉండొచ్చు. మహేష్ ను కలిసి మాట్లాడాలి. అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో చెప్పలేను. మంచి కథలే నా పెట్టుబడి. ప్రస్తుతం అయితే ఎఫ్‌-3 పనుల్లో బిజీగా ఉన్నా. ఇప్పటికే 22 రోజుల షూటింగ్ పూర్తి చేశాం. ఔట్ ఫుట్ సూపర్ గా వచ్చింది. ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం'' అని అనిల్ రావిపూడి తెలిపారు.

దీనిని బట్టి చూస్తే 'ఎఫ్3' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే అనిల్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ 'బీబీ3' తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా స్టార్ట్ చేస్తాడు. అలానే ఉస్తాద్ రామ్ కోలీవుడ్ డైరెక్టర్ తో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడు. ఇక మహేష్ 'సర్కారు వారి పాట' తర్వాత రాజమౌళి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి.. మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి.