Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో కరోనా విపత్తు తర్వాత ప్రాంతీయ విభేదాలు తప్పవా?
By: Tupaki Desk | 15 April 2020 8:24 PM ISTతెలుగు రాష్ట్రం రెండుగా చీలినప్పటి నుండి కూడా ఇండస్ట్రీలో ప్రాంతీయ విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉండటంతో పాటు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ విషయమై గతంలో కొందరు బయట పడ్డా మరికొందరు మాత్రం పైకి మాట్లాడకున్నా మౌనం పాటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కరోనా విపత్తు నేపథ్యంలో తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ విపత్తు నుండి బయట పడేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కరోనా విపత్తు నుండి బయట పడ్డ తర్వాత ఇండస్ట్రీ వర్గాల్లో చీలికలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటికి ఆజ్యం పోస్తూ తాజాగా తెలంగాణ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ప్రత్యేకంగా సమావేశం అయ్యి తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళంను అందజేసిన విషయం తెల్సిందే. తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ ఇంకా అభిషేక్ అగర్వాల్ తో పాటు మరికొందరు ఉన్నారు.
నైజాం ఏరియాలో మెజార్టీ శాతం థియేటర్లు మల్టీప్లెక్స్ లు ఏషియన్ సునీల్ నారంగ్ ఆధీనంలో ఉంటాయి. ఇండస్ట్రీలో ప్రాంతీయ విభేదాలు వస్తే తెలంగాణ యాసతో వచ్చే సినిమాలను ఏపీ వారు ఆధరించడం లేదు కనుక ఏపీ వారి సినిమాలను తెలంగాణలో కూడా ప్రదర్శించేందుకు ఒప్పుకోక పోవచ్చు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో పూర్తిగా తెలంగాణ టెక్నీషియన్స్ తో రూపొందిన పలు సినిమాలు ఏపీలో కనీసం విడుదలకు కూడా గతంలో నోచుకోలేదు. దాంతో పలువురు టీ ఫిల్మ్ మేకర్స్ ఆగ్రహంతో ఉన్నారు.
కరోనా తర్వాత ఇండస్ట్రీలో జరిగే పరిణామాల్లో భాగంగా తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ ఇంకా బయ్యర్స్ ఏపీ ఫిల్మ్ మేకర్స్ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తే పరిస్థితి ఏంటా అంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ఫిల్మ్ మేకర్స్ ఆధిపత్య పోరుతో ఇండస్ట్రీలో విభేదాలు తప్పవంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
