Begin typing your search above and press return to search.
హీరోల ఫ్యాన్స్ ఇంక మారరా? హీరోలు వాళ్లలో మార్పు తేలేరా?
By: Tupaki Desk | 21 May 2021 7:00 PM ISTసినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది. పోటీతత్వం ఉంటేనే మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఇక హీరోలను అభిమానించే వారి మధ్య కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవ పడుతుంటారు కూడా. ఒక్కోసారి హద్దులు మీరి ఇతర హీరోల ఫ్యాన్స్ తో ఘర్షణలకు దిగి రక్తం చిందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫ్యాన్ వార్ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతోంది.
టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో హీరోల అభిమానులు ఎవరికి వారు తమకు నచ్చని హీరోలపై ద్వేషంతో రగిలిపోతూ నెగిటివ్ కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది. అభ్యంతరకరమైన కామెంట్స్ పెట్టడంతో పాటు అసభ్యకరమైన ఎడిటింగ్ ఫోటోలు-వీడియోలు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అగ్లీ హ్యాష్ టాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా ఇతర హీరోలను కించపరుస్తూ తమ హీరోలని కూడా తక్కువ చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. నెగిటివ్ హ్యష్ ట్యాగ్స్ తో నేషనల్ వైడ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. వల్గర్ పోస్టులు నెగెటివ్ కామెంట్స్ తో ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తారక్ - చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ గొడవ స్టార్ట్ అయింది. దేశమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే హీరోల ఫ్యాన్స్ ఇలా ట్విట్టర్ లో కొట్లాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హీరోల పై అభిమానం చూపించడంలో తప్పులేదు. అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని పండుగ లాగా సెలెబ్రేట్ చేసుకోవడాన్ని కూడా ఎవరూ కదానరు. కానీ ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడమే వారి అభిమాన హీరోల స్థాయిని దిగజారుస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా రియల్ లైఫ్ కి వచ్చేసరికి అందరూ బాగా కలిసిపోతారు.
'మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి' అని పబ్లిక్ గా తమ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ అభిమానులకు హితబోధ చేసిన హీరోలు కూడా ఉన్నారు. అయినా సరే ఇలాంటివేమీ ఫ్యాన్స్ చెవికి ఎక్కవు. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా కారణంగా చనిపోతూ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా అవి వాళ్లకు పట్టవు. అందుకే ఇలా సోషల్ మీడియా వేదికగా గొడవలకు దిగుతుంటారు. హీరోలే స్వయంగా మీరు మారాలి అని చెప్పినా అభిమానుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదనేది తాజాగా మరోసారి నిరూపితమైంది.