Begin typing your search above and press return to search.

'సలార్'తో డైరెక్టర్ అంచనాలను బీట్ చేస్తాడా..??

By:  Tupaki Desk   |   15 Jan 2021 4:54 AM GMT
సలార్తో డైరెక్టర్ అంచనాలను బీట్ చేస్తాడా..??
X
టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఓవైపు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగానే వరుస సినిమాలను ప్రకటించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్. ఇక ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న 'సలార్' మూవీ మాత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. వీరి కాంబోలో వయోలెంట్ మాఫియా నేపథ్యంతో సలార్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మరి మిగతా సినిమాలతో పోలిస్తే సలార్ కే ఎందుకు ఇంతటి క్రేజ్, బజ్ ఏర్పడింది.. అంటే కారణం ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. సలార్ తర్వాత ఆ రేంజి బజ్ క్రియేట్ చేసే సత్తా కేవలం దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీకే ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈరోజు పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నారు సలార్ బృందం. ప్రభాస్ కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుతుందని టాక్. అయితే భీభత్సమైన వయోలెన్స్, యాక్షన్ ప్లాన్స్ తో రూపొందనున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్, ప్రభాస్ లకు స్పెషల్ అంట. డైరెక్టర్ ప్రశాంత్ కి ఇది నాలుగో సినిమా. అలాగే డైరెక్టర్ రాజమౌళి నాలుగవ సినిమా ఛత్రపతి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు ఈ దర్శకుడికి కూడా నాలుగో సినిమా కావడంతో సలార్ కూడా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా అవుతుందని సినీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. మరి అందరూ అనుకున్నట్లుగా ప్రశాంత్ నీల్ అంచనాలను రీచ్ అయ్యాడంటే.. ఓవైపు డైరెక్టర్ గా ప్రశాంత్ కి, మరోవైపు హీరో ప్రభాస్ ఇద్దరికి తిరుగుండదని అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సలార్ అంచనాలు అందుకుంటుందేమో..!!