Begin typing your search above and press return to search.

ఈ నిర్మాతల సినిమా వంద కోట్లు సాధిస్తుందా..?

By:  Tupaki Desk   |   29 April 2020 2:00 PM GMT
ఈ నిర్మాతల సినిమా వంద కోట్లు సాధిస్తుందా..?
X
టాలీవుడ్ లో కనీసం పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. అప్పుడే ఆ హీరో.. టాప్ హీరోలు కూడా ఇంతవరకు అందుకోలేని ఫీట్ సాధించాడు. అతనే విజయ్ దేవరకొండ. టాప్ హీరోలంతా చాలా సినిమాలు చేస్తేగాని అందుకోలేని వంద కోట్ల మార్క్ తన గీత గోవిందం సినిమాతో అందుకొని రికార్డు సృష్టించాడు. తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో హీరో నాని కన్నా ఎక్కువ మందిని విజయ్ ఆకట్టుకున్నాడు. తరువాత పెళ్లి చూపులు సినిమాతో యూత్ కి నచ్చేసాడు. ఇక అర్జున్ రెడ్డితో విశ్వరూపం చూపించి ఇండస్ట్రీలను ఆకట్టుకున్నాడు. తర్వాత గీత గోవిందం సినిమాతో ఏకంగా వందకోట్ల కలెక్షన్స్ సాధించేసాడు. విడుదలయిన 12 రోజులకే 102 కోట్ల గ్రాస్ సాధించింది. ఇది నిజంగా రికార్డే. ఎందుకంటే కేవలం 14 కోట్ల మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఈ రేంజ్ విజయం అస్సలు ఊహించనిది.

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా అనంతరం మరో గీత గోవిందం లాంటి రికార్డు విజయాన్ని అందుకోవాలని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అనుకుంటుందట. ఇదిలా ఉండగా ఆ రికార్డును నిఖిల్ హీరోగా రూపొందనున్న '18 పేజెస్' సినిమాతో సాధించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలోనే నిర్మాతలు బన్నీవాసు-సుకుమార్ లకు పొత్తు కుదరడం లేదట. డైరెక్టర్ సుకుమార్ ఏమో ఈ సినిమాను తన లెక్కల బుర్రతో 'కుమారి21ఎఫ్' లాంటి హిట్ కొడదాం అనుకుంటే.. బన్నీవాసు మాత్రం కరోనా తరువాత థియేటర్లలోకి జనాలు ఎక్కువ వచ్చే టైమ్ చూసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంటే మొత్తానికి ఈ ఏడాది డిసెంబర్ లోపు కావచ్చు. అయితే అసలు విషయం ఏంటంటే.. సుకుమార్ అందించిన ఈ కథకి, హీరో నిఖిల్ కి 100 కోట్లు గ్రాస్ తీసుకొని వచ్చే సత్తా ఉందా అనేదే పెద్ద ప్రశ్న. మరి ఏం జరుగనుందో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే!