Begin typing your search above and press return to search.

సైరా ట్రైలర్ రెడీ చేశారా ?

By:  Tupaki Desk   |   6 July 2019 10:21 AM IST
సైరా ట్రైలర్ రెడీ చేశారా ?
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా రిలీజ్ డేట్ అక్టోబర్ 2 అఫీషియల్ గా ప్రకటించకపోయినా దాదాపు ఖరారైపోయినట్టే కాబట్టి దానికి తగ్గట్టే ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకున్నారు. దానికన్నా ముందు చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 రానుంది. ఆ తేదీ నుంచే సైరా ప్రమోషన్ ను ట్రైలర్ తో మొదలుపెట్టనున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రామ్ చరణ్ దీని కోసమే ప్రత్యకంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నుంచి కొంత గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడట.

సైరాకు పెట్టిన బడ్జెట్ సుమారు 200 కోట్లు. ఖైదీ నెంబర్ 150 రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినప్పటికీ 150 కోట్ల దాకా గ్రాస్ రాబట్టి చిరు బాక్స్ ఆఫీస్ స్టామినాను రుజువు చేసింది. అలా అని అది అన్ని భాషల్లో విడుదల చేసింది కాదు. కేవలం తెలుగు వెర్షనే అంత రాబట్టి వామ్మో అనిపించింది. కానీ సైరా కథ వేరు. సరిగ్గా పడాలే కాని పెట్టుబడిని పది రోజుల్లో వెనక్కు రాబట్టవచ్చు. దానికి తగ్గట్టే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట.

సైరాను హిందీతో సహా మల్టీ లాంగ్వేజెస్ లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తెలుగువారికి సంబంధించినదే అయినప్పటికీ బ్రిటిష్ వారితో పోరాడిన స్వతంత్ర సమరయోధుడి గాధ కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. దేశం మొత్తం నేటివిటీతో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అవుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రైలర్ అందరికి నచ్చేలా ఎడిట్ చేస్తున్నట్టు తెలిసింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా వినికిడి. హైప్ వచ్చే విషయంలో ట్రైలర్ దే కీలక పాత్ర కాబట్టి గూస్ బంప్స్ వచ్చే తరహాలో అన్ని అంశాలు ఇందులో ఉండేలా కట్ చేస్తున్నారట. టీజర్ టైంలో వినిపించిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని అవి రిపీట్ కాకుండా చేస్తున్నారట. మొత్తానికి మెగా ఫాన్స్ కి సూపర్ గిఫ్ట్ సైరా ట్రైలర్ రూపంలో రెడీ అవుతోందన్న మాట