Begin typing your search above and press return to search.

ఈ నాలుగో వ్యక్తినైనా పెళ్లి చేసుకుంటావా? లేదా?

By:  Tupaki Desk   |   23 July 2022 1:30 PM GMT
ఈ నాలుగో వ్యక్తినైనా పెళ్లి చేసుకుంటావా? లేదా?
X
మాజీ విశ్వ సుందరి సుష్మిత సేన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నాలుగు పదుల అందగత్తె ఇప్పటికి కూడా ఇండియాస్‌ మోస్ట్‌ పాపులర్ సెలబ్రెటీల జాబితా లో ముందు ఉంటుంది. ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్న సుష్మితా సేన్ తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. వారిద్దరు కూడా ఆ విషయాన్ని అధికారికంగా చెప్పారు.

ఇటీవల సుష్మితా సేన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నా జీవితంలో చాలా విభిన్నమైన పురుషులను కలిశాను. వాళ్లలో కొందరు నిరాశ నిరుత్సాహం కలిగి ఉన్నారు. నేను మూడు సార్లు పెళ్లికి సిద్ధం అయ్యాను.

ఆ మూడు సార్లు కూడా నా చుట్టూ ఉన్న వారు నాకు సరైన వారు కాదని అనిపించింది. అంతే కాకుండా వాళ్లలో నిరాశ నిరుత్సాహం కనిపించింది.

అయితే నేను ఎప్పుడు రిలేషన్ లో ఉన్నా కూడా వారు నాతో మరియు నా పిల్లలతో బాగా కలిసి పోయారు. నా పిల్లలు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వాళ్లతో నా పిల్లలను చూసినప్పుడు కొత్తగా అనిపించేది. కాని దేవుడు మూడు సార్లు కూడా వారి నుండి సురక్షితంగా బయట పడేశాడు. నా పిల్లలు కూడా వారి నుండి కాపాడబడ్డారు అంది.

సుష్మిత వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా జనాలు విభిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో పరిచయం అయిన ముగ్గురు వ్యక్తులు సరైన వారు అయ్యి ఉండక పోవచ్చు.. మీరు వారి నుండి దూరం జరగడం మంచిది అయ్యింది. ఇప్పుడు ఈ నాల్గవ వ్యక్తి ( లలిత్‌ మోదీ) తో అయినా మీరు జీవితాంతం కలిసి ఉంటారు.. ఈయన్ను పెళ్లి చేసుకోబోతున్నారా అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు సుష్మిత నుండి కాని లలిత్‌ మోదీ నుండి కాని పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన కానీ.. ప్రస్తావన కానీ రాలేదు. కాని పరిస్థితులు చూస్తుంటే మాత్రం వీరి పెళ్లి త్వరలో జరుగుతుందేమో అనిపిస్తుందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.