Begin typing your search above and press return to search.
ఈసారి సూర్య సినిమా తెలుగులో ఆడేనా?
By: Tupaki Desk | 17 July 2021 4:00 PM ISTతమిళ హీరో అయినప్పటికి తెలుగు లో కూడా మంచి పేరు దక్కించుకున్నాడు సూర్య. ఈయన గత చిత్రం ఆకాశమే నీ హద్దురా ఓటీటీలోనే విడుదల అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూశారో.. తెలుగు వర్షన్ వ్యూస్ ఏ రేంజ్ లో వచ్చాయో అమెజాన్ వారికి తెలుసు. తమిళంతో పాటు సమానంగా తెలుగు లో కూడా ఆ సినిమాను చూశారనే టాక్ వచ్చింది. సూర్యకు తెలుగు లో అంతటి క్రేజ్ ఉంది.
అందుకే ఆయన ప్రతి సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా సమానంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు హీరో తరహాలోనే ఆయన సినిమాలు బిజినెస్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న వాడివాసల్ సినిమా విషయంలో మాత్రం కొందరు టాలీవుడ్ వర్గాల వారు ముఖ్యంగా మీడియా సర్కిల్స్ వారు కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వాడివాసల్ సినిమాకు దర్శకుడు వెట్రిమాన్. ఆయన సినిమా అంటేనే తమిళ నేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయన గతంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా కూడా అవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో వెట్రిమారన్ సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే సూపర్ హిట్ అవుతాయి.. తమిళులను కట్టి పడేసేలా మాత్రమే ఆయన సినిమాలు చేస్తాడనే టాక్ ఉంది.
ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా ధనుష్ హీరో అనే టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ధనుష్ తోనే ఆయన ఎక్కువగా సినిమాలు చేశాడు. కాని ఈసారి ఆయన సూర్యతో సినిమా చేస్తున్నాడు.. సూర్యకు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది. కనుక ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాలంటూ సూర్య అభిమానులు కోరుకుంటున్నారు.
కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఇప్పటికే వాడివాసల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా తమిళ సాంప్రదాయ జల్లికట్టు ఆట నేపథ్యంలో ఉంటుందని తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు లో జల్లి కట్టు ఆటపై పెద్దగా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు జల్లికట్టు ఆట గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కనుక ఈ సినిమాను ఆయన ఎలా తెరకెక్కిస్తాడో అనే చర్చ మొదలు అయ్యింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా తమిళంలో ఖచ్చితంగా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంటుంది. కాని జల్లి కట్టు కాన్సెప్ట్ అధికంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగులో అనుమానించాల్సిన విషయమే అంటున్నారు. తెలుగు లో వాడివాసల్ ఆడాలంటే కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు పాటు మరీ తమిళ నేటివిటీ కనిపించకూడదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
తెలుగు లో డబ్ అయిన సూర్య నటించిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెట్రి మారన్ కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచిని కాస్త పట్టించుకుని సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు. వెట్రి మారన్ కు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన వేరే భాషలో ఈయన సినిమాలు ఉంటాయా అంటే అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.