Begin typing your search above and press return to search.

'కపటదారి'గా సుమంత్ ఆ హీరోకు చెక్ పెడతాడా..??

By:  Tupaki Desk   |   13 Feb 2021 1:00 PM IST
కపటదారిగా సుమంత్ ఆ హీరోకు చెక్ పెడతాడా..??
X
అక్కినేని ఫ్యామిలీ హీరోలలో ఒకరు సుమంత్. కింగ్ నాగార్జున తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. కానీ ఇంతవరకు స్టార్ హీరోగా సెటిల్ అవ్వలేకపోయాడు. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్యలో హిట్స్ లేక భారీగ్యాప్ తీసుకొని మళ్లీరావా సినిమాతో మళ్లీ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మళ్లీరావా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈసారి జాగ్రత్తగా అడుగేసే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఆలస్యం అయినా సరే హిట్ కొట్టాలనే కసితో మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకొని కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. కపటదారి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై సుమంత్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

అయితే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న కపటదారి నుండి ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో ఆకట్టుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కపటదారి టైటిల్ ఎలాగున్నా ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కన్నడలో కవులదారి టైటిల్ తో తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. నందితశ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. కపటదారి సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అదేరోజు హీరో నితిన్ నటించిన యాక్షన్ డ్రామా చెక్ మూవీ విడుదల కాబోతుంది. ఆ సినిమా ట్రైలర్ కూడా సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. మొత్తానికి సుమంత్, నితిన్ ల మధ్య పోటీ ఏర్పడనుంది. మరి ఈ కపటదారి నితిన్ చెక్ సినిమాకు చెక్ పెడతాడా లేదా చూడాలి!