Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురిని సుక్కూ మ‌రో లెవ‌ల్ కి ఎత్తేస్తాడా?

By:  Tupaki Desk   |   4 July 2021 7:00 AM IST
ఆ న‌లుగురిని సుక్కూ మ‌రో లెవ‌ల్ కి ఎత్తేస్తాడా?
X
`రంగ‌స్థ‌లం` లాంటి క్లాసిక్ ని తెర‌కెక్కించిన సుకుమార్ ప్రస్తుతం `పుష్ప` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చ‌ర‌ణ్ త‌ర‌హాలోనే బ‌న్నికి కొత్త ఇమేజ్ ని తెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే అతడికి ఐక‌న్ స్టార్ గా ప్ర‌మోష‌న్ కూడా ఇచ్చారు సుక్కూ. అందుకు త‌గ్గ‌ట్టే బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌మోట్ చేయ‌నున్నారు.

పుష్ప డ్యూయాల‌జీతో అత‌డికి స‌రికొత్త గుర్తింపు ద‌క్క‌నుంద‌ని భావిస్తున్నారు. సుక్కూ త‌న హీరోల ఇమేజ్ ని మార్చేంత‌గా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌డు. ఆ ర‌కంగా బ‌న్ని ల‌క్కీ అనే చెప్పాలి. ఆర్య -ఆర్య 2 త‌ర్వాత పుష్ప‌తో బ‌న్నికి సరికొత్త మేకోవ‌ర్ ని కూడా సుక్కూ చూపించ‌నున్నాడు. తాజా స‌మాచారం మేర‌కు `పుష్ప` షూటింగ్ ఈ వారంలో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ షూట్ ముగిసిన తరువాత.. గోవాలో ప‌లు అంద‌మైన లొకేష‌న్ల‌లో షెడ్యూల్ తెర‌కెక్కుతుంది.

అటుపైనా విదేశాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. చైనా లేదా థాయ్ లాండ్ లోని విదేశీ ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన అడ‌వుల్లో కీల‌క భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధ‌మ‌య్యాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మొదటి భాగం 80 శాతం చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. మిగ‌తా భాగం సెప్టెంబర్ నాటికి పూర్త‌వుతుంది. రెండు భాగాలుగా తయారవుతున్న పుష్ప- 1 దసరా విడుదలను లక్ష్యంగా చేసుకోగా రెండవ భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల అవుతుంది.

ఇక ఈ మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న‌.. కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సునీల్ కి ఇది కీల‌క‌మ‌లుపు అవుతుంద‌న్న ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇదే చిత్రంతో విల‌న్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌ల‌యాళీ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ పేరు టాలీవుడ్ లో మార్మోగుతుంది. ఇక ఇందులో సునీల్ గ్రేషేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అత‌డు మునుప‌టి కంటే డిఫ‌రెంట్ గా క‌నిపిస్తాడ‌న్న టాక్ కూడా ఉంది. నిజానికి కంబ్యాక్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణించాల‌న్న సునీల్ క‌ల ఇప్ప‌టివ‌ర‌కూ నెర‌వేర‌లేదు. త్రివిక్ర‌మ్ అత‌డికి అవ‌కాశాలిచ్చినా కావాల్సిన రేంజును ఇవ్వ‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు సుకుమార్ పుష్ప‌తో సునీల్ ని మ‌రో లెవ‌ల్లో చూపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఉత్కంఠ పెంచుతోంది. ఇక సునీల్ అడ‌పాద‌డ‌పా హీరోగా న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు అలానే ఉన్నాయి.