Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సర్దుబాటు చేస్తాడా లేక ఊరుకుంటాడా?

By:  Tupaki Desk   |   31 Jan 2020 1:25 PM IST
స్టార్ హీరో సర్దుబాటు చేస్తాడా లేక ఊరుకుంటాడా?
X
అది ఒక స్టార్ హీరో నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ హీరో నటించడం లేదు.. మరో యువ హీరో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పేరుకు నిర్మాతే అయినా స్టార్ హీరో డబ్బు మాత్రం పెట్టడం లేదట. అసలు నిర్మాతే ఇన్వెస్ట్ మెంట్ విషయం అంతా చూసుకుంటున్నారట. ఈమధ్యే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీమ్ మధ్య ఏదో తికమక నడుస్తోందని అంటున్నారు.

నిజానికి ఆ స్టార్ హీరో ఈ సినిమా విషయం లో మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నారట. ఇందులో నటిస్తున్న హీరోకు మొదటి నుంచి అతి చేస్తాడనే పేరుంది. దానికి తగ్గట్టుగా సినిమాలో వీలైనంతగా వేళ్లు పెడుతూ ఉన్నాడట. దీంతో ఫిలిం యూనిట్ లో ఒకరంటే ఒకరికి పొసగడం లేదని అంటున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆపేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఒకవైపు ఈ గొడవలు అంతర్గతం గా జరుగుతూ ఉన్నప్పటికీ వాటికి సంబంధం లేకుండా టీజర్ మాత్రం రిలీజ్ చేయడం ఈ విషయం తెలిసిన వారిని ఆశ్చర్యం లో ముంచెత్తింది.

మరి ఈ సినిమా ఆగిపోతుందా.. లేక నిర్మాతగా ఉన్న స్టార్ హీరోగారు జోక్యం చేసుకొని యూనిట్ మెంబర్స్ గొడవలను సర్దుబాటు చేసి సినిమాను సాఫీగా పూర్తయ్యేలా చూస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సినిమా షూటింగ్ ఆగి పోతే మాత్రం ఆ విషయాన్ని దాచి పెట్టడం వీలు కాదు కదా?