Begin typing your search above and press return to search.

స్టార్ హీరో జ‌డ్జిమెంట్ మ‌ళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్‌ చేస్తుందా?

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
స్టార్ హీరో జ‌డ్జిమెంట్ మ‌ళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్‌ చేస్తుందా?
X
మ‌నం ఒక‌టి త‌లిస్తే దైవమొక‌టి త‌లిచిన‌ట్టు కొన్ని.. కొన్ని మ‌న అంచ‌నాల‌కు మించి జ‌రుగుతుంటాయి. సినిమాల్లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌నుకుంది భారీ డిజాస్ట‌ర్ గా మారొచ్చు.. ఇదేం సినిమారా బాబూ అనుకున్న‌ది ఇండ‌స్ట్రీ హిట్ గా మారి షాకివ్వొచ్చు. డైరెక్ట‌ర్ మ‌నకు చెప్పింది ఒక‌టి చేస్తుంది మ‌రొక‌టి.. దీన్ని ఇక్క‌డి కిక్క‌డే ఇప్ప‌టికిప్పుడే ఆపేద్దాం అని స్టార్ హీరోలు అనుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేసిన‌వి వున్నాయి. ఇండ‌స్ట్రీ హిట్ లుగా నిలిచి ఓ స్టార్ హీరో కెరీర్ నే స‌మూలంగా మార్చిన సినిమాలూ వున్నాయి.

ఇప్పుడు అదే స్టార్ హీరో ప్ర‌స్తుతం సెట్స్ పై వున్న త‌న సినిమా విష‌యంలో అసంతృప్తితో వున్నార‌ట‌. గ‌త కొన్నేళ్ల క్రితం స్టార్ డైరెక్ట‌ర్ తో త‌న 12 సినిమా చేసిన స్టార్ హీరో మొద‌ట్లో ఈ మూవీ అంత‌గా రావ‌డం లేద‌ని ఫీల‌య్యార‌ట‌. ఆ కార‌ణంగానే ఆ సినిమా టైమ్ లో డైరెక్ట‌ర్ తో ఎడ ముఖం పెడ‌ముఖంగా వున్నార‌ట‌. అయితే అనూహ్యంగా అదే సినిమా స‌ద‌రు హీరోకు ఇండ‌స్ట్రీ హిట్ ని అందించి అప్ప‌టి వ‌ర‌కు వున్న రికార్డుల్ని తిర‌గ‌రాసింది. అంతే కాకుండా హీరోగా అత‌ని కెరీర్ ని, స్టైల్ ని కూడా స‌మాలంగా మార్చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక ఇదే హీరో ఆ త‌రువాత స‌ద‌రు డైరెక్ట‌ర్ తో చేసిన 17వ సినిమా విష‌యంలోనూ అదే ఫీల‌య్యాడ‌ట‌. సినిమా అనుకున్న విధంగా రావ‌డం లేద‌ని, ఏదో చెప్పి ఇంకేదో తీస్తున్నాడ‌ని స‌ద‌రు స్టార్ హీరో తెగ ఫీల‌య్యార‌ట‌. క‌ట్ చేస్తే ఆ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి హీరో జ‌డ్జిమెంట్ రాంగ్ అని ప్రూవ్ చేసి షాకిచ్చింద‌ట‌. తాజాగా ఇదే స్టార్ హీరో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. యంగ్ డైరెక్ట‌ర్ కి ఈ సారి అవ‌కాశం ఇచ్చారు. అంతే కాకుండా స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ కి ఈ హీరోతో సినిమా చేయాల‌న్న‌ది డ్రీమ్.

రౌడీ స్టార్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాని తెర‌కెక్కించి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ త‌న అభిమాన హీరోని స‌రికొత్త పంథాలో ఆవిష్క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్త‌యిపోయింది. త్వ‌ర‌లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే స్టార్ హీరో మాత్రం స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ విష‌యంలో తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ట‌.

చెప్పింది ఒక‌టి తీసింది మ‌రొక‌ట‌ని స‌ద‌రు స్టార్ హీరో తెగ ఫీల‌వుతున్నాడ‌ట‌. సాంగ్స్ షూటింగ్ స‌మ‌యంలో, ప్యాచ్ వ‌ర్క్ స‌మ‌యంలో కానీ డైరెక్ట‌ర్ ని సెట్ లో క‌నిపించొద్ద‌ని చెప్పండి అంటూ కో డై రెక్ట‌ర్ తో లాగించేస్తున్నార‌ట‌.

గ‌తంలో ఇదే స్టార్ హీరో రెండు మూడు చిత్రాల‌కు ఇలాగే చేశారు. అయితే అవి ఆయ‌న జ‌డ్జిమెంట్ రాంగ్ అని నిరూపించి బాక్సాఫీస్ వ‌ద్ద ఇండ‌స్ట్రీ హిట్ గా, బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచి మ్యాజిక్ చేశాయి. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా విష‌యంలోనూ స్టార్ హీరో జ‌డ్జిమెంట్ మ‌ళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంద‌ని అంతా అంటున్నారు. సెంటిమెంట్ ప్ర‌కారం స్టార్ హీరో చేస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఖచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఇండ‌స్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.