Begin typing your search above and press return to search.

వైట్ల బర్త్ డే కి మాస్ రాజా పివొట్

By:  Tupaki Desk   |   22 Sept 2018 5:24 PM
వైట్ల బర్త్ డే కి మాస్ రాజా పివొట్
X
మాస్ మహారాజా తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోని' త్వరలో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేసిన టీమ్ తాజాగా పివొట్ తో ముందుకొస్తామని అంటోంది.

'AAA పివొట్ ను సెప్టెంబర్ 24 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. మాకు టీజర్ తెలుసు.. ట్రైలర్ తెలుసు ఈ పివొట్ ఏంటి అని మీరేమీ టెన్షన్ పడకండి. చాలామంది పివొట్ అనే పదాన్ని ఎక్సెల్ షీట్స్ లో.. SQL లో విని ఉంటారు. అక్కడ పివొట్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఇవన్నీ పక్కన బెడితే పివొట్ ను తెలుగులో 'ఇరుసు' అంటారు. అంటే ఒక మూవ్ మెంట్ కు చాల కీలకమైనదన్నమాట. మరి ఇలాంటి పేరు పెట్టారంటే సినిమా కు సంబంధించిన థీమ్ గానీ ప్లాట్ గానీ రివీల్ చేస్తారని మనం ఆశించొచ్చు.

అవన్నీ కాదు.. అంత లాజిక్.. డెఫినిషన్స్ లేవు.. మేము మాస్.. హీరో మాస్ రాజా..మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది అని ఇంకేదైనా చెప్తే మనం చేసేందుకు ఏమీ ఉండదు.. తూర్పు తిరిగి దండం పెట్టడమే! ఇవన్నీ సరే.. 24 వ తేదీ ఈ సడెన్ సర్ ప్రైజ్ ఏంటి అని మీకేమైనా అనుమానం వచ్చిందా? వస్తే మంచిదే.. మీరు చాలా చాలా షార్ప్ గా ఉన్నట్టు. సెప్టెంబర్ 24 శ్రీను వైట్ల పుట్టిన రోజు.