Begin typing your search above and press return to search.

ఆ హీరోను ‘సోడా సెంట‌ర్‌’ నిలబెడుతుందా?

By:  Tupaki Desk   |   27 Jun 2021 2:30 PM GMT
ఆ హీరోను ‘సోడా సెంట‌ర్‌’ నిలబెడుతుందా?
X
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నెపోటిజానికి కొద‌వ‌లేదు. చిత్ర ప‌రిశ్ర‌మలో బ‌లంగా పాతుకుపోయిన‌వారంతా వార‌సుల‌ను నిల‌బెట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు. మ‌రికొంద‌రు భుజాల‌మీద నిల‌బెట్టి మ‌రీ ఉట్టికొట్టిద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు కూడా. కానీ.. అది మ‌రింత‌గా ఊరిస్తూ పైపైకే వెళ్తోంది. అన్ని అవ‌కాశాలూ ఉండి కూడా, ఫుల్ స‌పోర్టు ల‌భించి కూడా ఆ ‘ఉట్టి’ కొట్ట‌లేక‌పోతున్న‌వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు.

ఘట్టమనేని సినీవారసుడిగా వచ్చిన సుధీర్ బాబు కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు, మ‌హేష్ బావ అనే ట్యాగ్ లైన్ ఇంకా వ‌దిలించుకోలేక‌పోతున్నాడు. దాదాపు ప‌ది చిత్రాల వ‌ర‌కూ రిలీజ్ చేసినా.. ఆశించిన హిట్ మాత్రం ప‌డ‌లేద‌నే చెప్పాలి. ‘ప్రేమ క‌థాచిత్ర‌మ్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నా.. ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవాలంటే అది చాల‌దు. అందుకే.. త‌న వంతు ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నాడు.

కొత్త‌గా ట్రై చేద్దామ‌ని ‘వి’ వంటి సినిమా చేసినప్పటికీ.. రిజల్ట్ పాతదే రిపీట్ అయ్యింది. అయితే.. నటుడిగా మాత్రం పరిణతి చెందుతూ వస్తున్నాడనే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సుధీర్ బాబు నుంచి రాబోతున్న మూవీ ‘శ్రీదేవీ సోడా సెంట‌ర్‌’.

‘పలాస’ చిత్రంతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఆనంది హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మం మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే డ‌బ్బింగ్ పూర్త‌య్యింది. ఇందుకు సంబంధించిన సుధీర్ బాబు వీడియో కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి, ఈ చిత్రం సుధీర్ బాబుకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.