Begin typing your search above and press return to search.

ఐష్ అందానికి విల్ స్మిత్ ఫిదా!

By:  Tupaki Desk   |   6 Oct 2018 4:32 PM GMT
ఐష్ అందానికి విల్ స్మిత్ ఫిదా!
X
హాలీవుడ్ లోని టాప్ హీరోల‌లో విల్ స్మిత్ ఒక‌రు. ఐయామ్‌ లెజెండ్‌, ఐ రోబో, ఇండిపెండెన్స్‌ డే, మెన్‌ ఇన్‌ బ్లాక్‌ వంటి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సిని మాల్లో విల్‌ స్మిత్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ద‌క్కాయి. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, కమెడియ‌న్ గా, లిరిక్ రైట‌ర్ గా స్మిత్‌... హాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా, మహమ్మద్‌ అలీ బయోపిక్ లో విల్‌ స్మిత్ న‌టిస్తున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఢిల్లీ వ‌చ్చిన విల్ స్మిత్....ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్ తో క‌లిసి ఓ సినిమా చేయాలని ఉంద‌ని త‌న మ‌న‌సులో మాట‌ను విల్ స్మిత్ వెల్ల‌డించాడు. ఢిల్లీలో జ‌రిగిన హిందూస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమిట్ లో పాల్గొన్న విల్ స్మిత్.....ఫర్హాన్‌ అక్తర్‌తో ఈ మాట చెప్పారు.

15 ఏళ్ల క్రిందట ఐష్ ను విల్‌ స్మిత్ కలిశారట. తామిద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకున్నార‌ట‌. అయితే, ఆ అవ‌కాశం ఇప్ప‌టివ‌ర‌కు రాలేద‌ని, త్వ‌ర‌లోనే ఆమెతో కలిసి సినిమా చేస్తానేమో అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విల్‌ స్మిత్ తో ఫర్హాన్‌ భాంగ్రా స్టెపులను వేయించారు‌. విల్ స్మిత్‌ వేసిన భాంగ్రా స్టెప్పుల‌ వీడియోను ఫర్హాన్‌ అక్తర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఖాతాలో షేర్‌ చేశారు. గ‌తంలో ఐష్ కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య దీపికా ప‌దుకొనే - ప్రియాంకా చోప్రాలు హాలీవుడ్ లో రాణిస్తున్నారు. కానీ, విల్ స్మిత్ వంటి ఓ స్టార్...సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన ఐష్ తో క‌లిసి సినిమా చేయాల‌నుకోవ‌డం నిజంగా విశేష‌మే.