Begin typing your search above and press return to search.

బాహుబ‌లిని మించిన‌ శివ‌భ‌క్తుడు!

By:  Tupaki Desk   |   5 March 2019 10:12 AM GMT
బాహుబ‌లిని మించిన‌ శివ‌భ‌క్తుడు!
X
మ‌హాశివ‌రాత్రి మ‌హ‌త్తుకు ప్ర‌త్య‌క్ష‌ నిద‌ర్శ‌న‌మిది. దేవాదిదేవుడైన‌ ప‌ర‌మేశ్వ‌రుని మ‌హిమలు కేవ‌లం ఇండియా వ‌ర‌కే ప‌రిమితం అనుకుంటే అంత‌కంటే పొర‌పాటు ఇంకొక‌టి లేదు. ప్ర‌పంచాన్ని శాసించేది శంక‌రుడు .. ముక్కంటి అని ఒప్పుకుని తీరాల్సిందే. గ‌ర‌ళాన్ని కంఠంలో దాచుకున్న నీల‌కంఠుని ప‌వ‌ర్ విశ్వ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉంది. గూగుల్ వెతికితే విల్ స్మిత్ క‌నిపిస్తాడో లేదో కానీ, ప‌ర‌మ‌శివుడు క‌నిపించి తీరాల్సిందే.

అందుకే సాక్షాత్తూ హాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ విల్ స్మిత్ ఇండియాకి దిగొచ్చాడు. ప్ర‌యాగ లో కుంభ‌మేళాకు ఎటెండ్ అయ్యి ప‌ర‌మ‌శివుని పూజించి త‌రించాడు. శివుని సేవ‌లో విల్ స్మిత్ ని చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. ఆయ‌న ఎంతో నిష్ఠ‌గా శివుని ఆరాధించాడు. శివ‌భ‌క్తునికి మ‌రు రూపంలా క‌నిపించాడు. పూజా కార్య‌క్ర‌మాల్లో భాగంగా శివ లింగానికి శుచి చేశాడు. గంగాజలంతో క‌డిగి పాలాభిషేకం చేశాడు. అటుపై హార‌తి ఇచ్చాడు. ఈ మొత్తం ప్రాసెస్ క‌న్నుల పండుగ‌గా క‌నిపించింది.

`లెజెండ్` సినిమాలో రాక్ష‌స కుక్క‌ల‌(జాంబీ)తో పోరాడేవాడిగా న‌టించాడు. కాల భైర‌వు(కుక్క‌)నికి శివునికి సంబంధం ఉంది కాబ‌ట్టి విల్ స్మిత్ కి ఆనాడే అనుబంధం ఉంద‌ని భావించాలి. `మెన్ ఇన్ బ్లాక్` సైన్స్ ఫిక్ష‌న్‌ సిరీస్ తో గొప్ప ప్ర‌యోగం చేసిన‌ప్పుడే విల్ స్మిత్ లోని క్రియేటివ్ గాడ్ ని జ‌నం అంతే గొప్ప‌గా ఆరాధించారు. ఒకే ఒక్క స్టింట్ తో శివ‌భ‌క్తిలో బాహుబ‌లినే మించి పోయాడు ఈ గ్రేట్ హాలీవుడ్ స్టార్. శివుడు(గిరిజ‌న గూడెం వాసి), అమ‌రేంద్ర బాహుబ‌లి ఎంత‌టి శివ భ‌క్తులో తెలిసిందే. శివ‌లింగాన్నే ఎత్తిన మొన‌గాడుగా బాహుబ‌లి క‌నిపిస్తే.. ఇప్పుడు ఆ శివ‌లింగానికే అర్చ‌న చేసిన హాలీవుడ్ బాహుబ‌లిగా కీర్తినందుకుంటున్నాడు విల్ స్మిత్. జ‌క్క‌న్న బాహుబ‌లి 3, బాహుబ‌లి 4 తీస్తే క‌చ్ఛితంగా విల్ స్మిత్ కి ఓ క్యారెక్ట‌ర్ క్రియేట్ చేయాల్సిందే. తెలుగు సినిమా బిజినెస్ ని మ‌రింత‌గా విశ్వ‌వ్యాప్తం చేసేందుకు విల్ స్మిత్ ని ప‌ర‌మ‌శివుడు ఇలా ఇండియాకి ర‌ప్పించాడ‌న్న‌మాట‌!!