Begin typing your search above and press return to search.

మ‌ర‌ణంతోనే విడాకులు సాధ్య‌మ‌‌న్న వ‌ర‌ల్డ్ నం.1 హీరో

By:  Tupaki Desk   |   23 July 2020 9:10 AM GMT
మ‌ర‌ణంతోనే విడాకులు సాధ్య‌మ‌‌న్న వ‌ర‌ల్డ్ నం.1 హీరో
X
ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ పారితోషికం అందుకునే అమేజింగ్ హీరోగా అత‌డు ద‌శాబ్ధం పైగానే ఏలాడు. హాలీవుడ్ స‌హా భార‌త‌దేశంలోనూ అత‌డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధార‌ణం. అత‌డు న‌టించిన సినిమాల‌కు దేశీయంగా బోలెడంత గిరాకీ ఉంది. అత‌డు ఎవ‌రు అంటే.. ది గ్రేట్ విల్ స్మిత్ గురించే ఇదంతా. 51 సంవ‌త్స‌రాల లెజెండ‌రీ హీరో ఇటీవ‌ల భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మాల‌పై త‌న‌కు ఉన్న గౌర‌వాన్ని చాటుకున్నాడు. కాశీ-వార‌ణాసి ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న‌తో భార‌తీయుల మ‌న‌సు దోచాడు. తాజాగా అత‌డి విడాకుల‌పై ప్ర‌స్తుతం వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే 22 ఏళ్ల కొడుకు ఉన్న ఈ స్టార్ హీరో త్వ‌ర‌లో భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నాడు! అంటూ ఓ పుకార్ షికార్ చేస్తోంది. అయితే దీనికి విల్ స్మిత్ ఏమ‌ని స‌మాధానం చెబుతున్నాడు? అంటే.. ప్ర‌తిసారీ చెప్పిన‌ట్టే అస‌లు త‌న విడాకులు త‌న మ‌ర‌ణంతోనే సాధ్య‌మ‌ని చెబుతున్నాడు. మేమిద్ద‌రం క‌లిసే మ‌ర‌ణిస్తామ‌ని భార్య‌తోనే త‌న జీవితం తుదికంటా కొన‌సాగుతుద‌ని కూడా అంటున్నాడు.

అయితే అత‌డు త‌న‌పై పుకార్లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఇలానే చెబుతుంటాడ‌ని సెటైర్లు ప‌డుతున్నాయి. విల్ స్మిత్ - జాడా పింకెట్ స్మిత్ విడిపోతున్నార‌ని చాలా సంవ‌త్స‌రాలుగా ప్ర‌చారం సాగుతూనే ఉంది. ఈ జంట‌ 22 సంవత్సరాలుగా దాంప‌త్య జీవితం విజ‌య‌వంతంగా సాగిస్తున్నారు. వీరికి 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. పేరు జాడెన్ స్మిత్. అలాగే కూతురు కూడా ఉంది.

ఇంత‌కుముందు ఫేస్ బుక్ వాళ్ల రెడ్ టేబుల్ టాక్ లో పాల్గొని విడాకుల వార్త‌ల్ని నిజం కాద‌ని విల్ స్మిత్ ఖండించాడు. 2006లో ఎంటీవీ ఇంట‌ర్వ్యూలోనూ ఒక మాట‌న్నాడు. ``విడాకులు ఒక ఎంపిక కాదు. జాడాతో నేను దేవుని ముందు నిలబడి.. మరణం మాకు భాగం కావాలి అని కోరాను`` అని లైవ్ లో నే తెలిపాడు. మేము కలిసి ఉండబోతున్నాం.. ఒక‌టి మరణం వరకు.. లేదా నేను చనిపోయేవ‌ర‌కూ.. అని విల్ స్మిత్ అన్నాడు. 1997 పెళ్లి ప్రమాణాలకు ముందు జాడాకు అప్పటికే రెండు నెలలు, వారి కుమారుడు జాడెన్ స్మిత్ క‌డుపులో ఉన్నాడ‌ట‌.

విల్ స్మిత్ న‌టించిన `జెమిని మేన్` మూవీ 2019లో రిలీజైంది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్ష‌న్ అందుబాటులో ఉంది. క్లోనింగ్ మాఫియా.. స్నైప‌ర్స్ నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. ఇందులో గ్రేట్ స్నైప‌ర్స్ క్లోనింగ్ స్టోరి ఆక‌ట్టుకుంటుంది. విల్ స్మిత్ త‌న‌యుడు జేడ్ స్మిత్ తో క‌లిసి ప‌లు చిత్రాల్లోనూ న‌టించాడు.