Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫ‌ర్ తో శ్ర‌ద్ధా పెళ్లి.. మ‌రి ప్ర‌భాస్ సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   4 March 2021 3:30 PM GMT
ఫోటోగ్రాఫ‌ర్ తో శ్ర‌ద్ధా పెళ్లి.. మ‌రి ప్ర‌భాస్ సంగ‌తేంటి?
X
డార్లింగ్ ప్రభాస్ స‌ర‌స‌న సాహో చిత్రంలో న‌టించింది శ్ర‌ద్ధా క‌పూర్. అయితే అప్ప‌ట్లోనే ప్ర‌భాస్ డీప్ గా ల‌వ్ లో ప‌డ్డాడ‌ని.. శ్ర‌ద్ధాతో నిండా మునిగిపోయాడ‌ని తెలుగు మీడియాలో ప్ర‌చారమైంది. బాలీవుడ్ లో అదే ప‌నిగా క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. ఇక ఇవే ప్ర‌శ్న‌ల్ని సాహో రిలీజ్ ఇంట‌ర్వ్యూల్లో అడిగేస్తే శ్ర‌ద్ధా.. ప్ర‌భాస్ ర‌క‌ర‌కాలుగా స్పందించారు. ప్ర‌స్తుతం ఫోటోగ్రాఫ‌ర్ ఫ్రెండు రోష‌న్ శ్రేష్ఠ‌ను శ్ర‌ద్ధా క‌పూర్ పెళ్లాడ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతున్న వేళ మ‌రోసారి శ్ర‌ద్ధా పాత ఇంటర్వ్యూల్లో ప్ర‌భాస్ తో పెళ్లి వ్య‌వ‌హారంపై మాట్లాడిన వీడియో క్లిప్పింగులు వైర‌ల్ అవుతున్నాయి.

అనుష్క శెట్టితో డేటింగ్ ఎంత‌వ‌ర‌కూ? అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ నాటి ఇంర్వ్యూల్లో శ్ర‌ద్ధాతో పాటే ఉన్న‌ప్పుడు ఏమ‌న్నారంటే.. త‌ను ఫ్రెండు మాత్ర‌మేన‌ని క్లారిటీనిచ్చారు. అమెరికాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త కుమార్తెను వివాహం చేసుకోవడం గురించి ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా అన్ని విషయాలు ఆ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. శ్రద్ధా కపూర్ ‌తో డేటింగ్ చేయడాన్ని ధృవీకరించాడా అంటే..!

తాను అనుష్క శెట్టితో డేటింగ్ చేయలేదని ...అమెరికా ఎన్నారై అమ్మాయిని వివాహం చేసుకోవడం లేద‌ని చెప్పిన‌ట్టే.. శ్ర‌ద్ధాతో త‌న‌కు ఏదీ లేద‌ని మాత్ర‌మే అన్నాడు. కొన్నిసార్లు అయితే న‌వ్వుతోనే స‌రిపెట్టేసాడు.

గర్ల్ ఫ్రెండ్ ఉందా? అనే ప్రశ్న ప్రభాస్ కు ఎదురైనప్పుడు టీజింగ్ రిప్లై ఇచ్చాడు. ``కావచ్చు.. ఉండకపోవచ్చు`` అని అన్నాడు. దానికి శ్రద్ధా కపూర్ నవ్వుతూ ``బాగుంది`` అంటూ టీజింగ్ ని కంటిన్యూ చేసారు ఆ ఇంట‌ర్వ్యూలో.. సాహో సహ-నటుల మధ్య ఏదో నిజంగా జ‌రుగుతోంది! అని ప్ర‌చార‌మైంది.

శ్ర‌ద్ధా క‌పూర్ గ‌త ఇంట‌ర్వ్యూలు ప‌రిశీలిస్తే.. ప్ర‌భాస్ ని పెళ్లాడ‌తారా? అన్న ప్ర‌శ్న‌కు... `మే బి మే బి నాట్` అంటూ డొంక తిరుగుడు స‌మాధాన‌మే ఇచ్చింది. ఇక‌పోతే ప్ర‌భాస్ ఇంటి నుంచి త‌న‌కోసం వ‌చ్చిన క్యారేజీని ఫుడ్ ని అస్స‌లు ఎప్పటికీ మ‌ర్చిపోలేన‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ నోరూరుతూ ఉంటుంద‌ని కూడా శ్ర‌ద్ధా ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.