Begin typing your search above and press return to search.

సందీప్ కిష‌న్ కు ఈ సారైనా హిట్టొస్తుందా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 11:09 AM GMT
సందీప్ కిష‌న్ కు ఈ సారైనా హిట్టొస్తుందా?
X
తెలుగు, త‌మిళ భాష‌ల్లో విభిన్న‌మైన సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. అయితే త‌న‌కు స్థాయికి త‌గ్గ స‌క్సెస్ ల‌ని మాత్రం గ‌త కొంత కాలంగా సొంతం చేసుకోలేక‌పోతున్నాడు. 'A1 ఎక్స్‌ప్రెస్' తో ఫ‌ర‌వాలేద‌నిపించిన సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం 'మైఖేల్' పేరుతో పాన్ ఇండియా మూవీతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. రంజిత్‌ జ‌య‌కోడీ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, క‌ర‌ణ్ సీ ప్రొడ‌క్ష‌న్స్ ఓల్ ఓల్ పీ బ్యాన‌ర్ ల‌ పై భ‌ర‌త్ చౌద‌రి, సుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు.

దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, విల‌న్ గా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ఏక కాలంలో రిలీజ్ కానుంది. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. 'మేఖేల్ .. వేటాడ‌టం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్‌' అంటూ చెబుతున్న సంభాష‌ణ‌లు సినిమా డెప్త్ ని తెలియ‌జేస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం లిరిక‌ల్ వీడియోల‌తో ప్ర‌మోష‌న్స్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 28 బుధ‌వారం ఫ‌స్ట్ సింగిల్ గా 'నువ్వుంటే చాలు' అంటూ సాగే గీతాన్ని విడుద‌ల చేశారు.

సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన ఈ పాట‌కు సామ్ సీఎస్ సంగీతం అందించ‌గా, క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి త్రిపుర‌నేని సాహిత్యం అందించాడు. డ్రీమీ మెలోడీగా సాగే ఈ పాట‌లో సందీప్ కిష‌న్‌, దివ్యాన్ష కౌశిక్ న‌టించారు.

ఇద్ద‌రి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ పాట‌కు మరింత ప్ల‌స్ గా మారింది. ఇదే పాట‌లో హీరో, హీరోయిన్ ల మ‌ధ్య లిప్ లాక్ స‌న్నివేశాలు కూడా ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. విజువ‌ల్స్ ప‌రంగానూ ఈ సాంగ్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మెలోడీ ప్ర‌ధానంగా సాగే రొమాంటిక్ సాంగ్ గా రూపొందిన ఈ పాట‌కు సామ్ సీఎస్ అందించిన సంగీతం బాగుంది. గ‌త కొంత కాలంగా స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిష‌న్ ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

టీజ‌ర్ తో అంచ‌నాల్ని క్రియేట్ చేసిన ఈ మూవీతో సందీప్ కిష‌న్ ఈ సారైనా హిట్ ని సొంతం చేసుకుంటాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పాన్ ఇండియా మూవీగా వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో విడుద‌ల‌కు రెడీ అవుతున్న ఈ మూవీ సందీప్ కిష‌న్ ఆశ‌ల్ని నెర‌వేర్చి త‌న కెరీర్ ని మ‌రో మెట్టు పైకి ఎక్కిస్తుందా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.