Begin typing your search above and press return to search.

సమంత స్టామినా చూపించే టైం ఇదే..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 5:34 AM GMT
సమంత స్టామినా చూపించే టైం ఇదే..!
X
శుక్రవారం రిలీజ్ అవుతున్న యశోద సినిమాపై సమంత ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. హరి హరీష్ దర్శకులు కలిసి చేసిన ఈ మూవీని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న యశోద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసినట్టు తెలుస్తుంది. సమంత ఇమేజ్ ని వాడుకుని సినిమాని బిజినెస్ చేసినట్టున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్ గా 24 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు ఈ టార్గెట్ పెద్దదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఓ పెళ్లైన హీరోయిన్ మీద ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అనే అంటున్నారు.

సమంత యశోద హిట్ అనిపించుకోవాలంటే 40 కోట్ల గ్రాస్ పాతిక కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. సినిమా ట్రైలర్ తో ఆసక్తి కలిగించినా సమంత పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోవడం కూడా సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. తను ఓ పక్క తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నా సరే సినిమాకు తన వంతుగా చేయాల్సినవన్ని చేస్తుంది సమంత. అందుకే రిస్క్ తీసుకుని మరీ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సమంతని చూసి ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

యశోద సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని.. ఈ సినిమాలో మీరు ఊహించని విధంగా సన్నివేశాలు ఉంటాయని అవి తప్పకుండా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని అంటుంది సమంత. అయితే ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది.

ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో సరికొత్త నూతన ఉత్సాహంతో వస్తున్న ఈ యశోద ప్రేక్షకులను అలరింపచేస్తుందా.. సినిమాలో నిజంగానే సమంత చెప్పిన వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

ఈ సినిమా సమంత స్టామినాకి ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. యశోద హిట్టు పడితే మాత్రం సమంతని ఆపడం ఎవరి వల్లా కాదు. ఓడిపోయిన ప్రతిసారి వెనక్కి తగ్గినా మళ్లీ సరికొత్త ఉత్సాహంతో ముందుకొస్తున్న సమంతకి కాలం కూడా పరీక్ష పెడుతుంది.

ఓ పక్క వ్యాధితో బాధపడుతూనే మరోపక్క సినిమా సక్సెస్ ని ఆకాంక్షిస్తుంది సమంత. యశోద సినిమా హిట్ చేసి ఆమె మీద ఉన్న అభిమానం చూపించాలని ఫిక్స్ అయ్యారు సమంత ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర సమంత ఫ్యాన్స్ ఆమె పోస్టర్స్ తో తెగ హడావిడి చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.