Begin typing your search above and press return to search.
మేనేజర్ల కోసం సుధీర్ బాబు సినిమాని సమంత - రష్మిక ప్రమోట్ చేస్తారా..?
By: Tupaki Desk | 12 Dec 2020 4:11 PM ISTదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ - సుధీర్ బాబు కాంబినేషన్ లో 'సమ్మోహనం' 'వి' వంటి సినిమాలు తెరకెక్కాయి. ఈ క్రమంలో ఇటీవల వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు - కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించనుంది. ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబోకి క్లాస్ ఆడియెన్స్ లో బాగానే క్రేజ్ ఉంది. 'వి' చిత్రం డిజాస్టర్ అనిపించుకున్నప్పటికి సుధీర్ బాబుకి బాగానే కలిసి వచ్చింది. దీంతో గత సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి ప్రీ బిజినెస్ బాగానే అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.
కాగా, మహేంద్రబాబు - కిరణ్ బాలపల్లి లు స్టార్ హీరోయిన్లయిన అక్కినేని సమంత - రష్మిక మందన్నా మేనేజర్స్ అని తెలుస్తోంది. దీంతో సుధీర్ బాబు సినిమాను రష్మిక - సమంత ప్రమోట్ చేస్తారేమో అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించనుండగా.. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో 14వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.