Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డైరెక్ట‌ర్ ని స‌ల్లూ భాయ్ క‌రుణిస్తాడా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 7:30 AM GMT
ప‌వ‌న్ డైరెక్ట‌ర్ ని స‌ల్లూ భాయ్ క‌రుణిస్తాడా?
X
టాలీవుడ్ టాప్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేశాడు. మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ తో 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' మూవీని తెర‌కెక్కించాల‌ని గ‌త రెండేళ్లుగా విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌డం లేదు. కార‌ణం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లోనూ క్రియాశీల‌కంగా పాల్గొంటూ క్ష‌ణం తీరిక లేకుం్డా గ‌డుపుతున్నారు.

అంతే కాకుండా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి సారి భారీ పీరియాడిక్ ఫిల్మ్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ గ‌త కొంత కాలంగా నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఓ షెడ్యూల్ చేస్తే మ‌రో షెడ్యూల్ కి బ్రేకిస్తున్నారు. రీసెంట్‌గా వైజాగ్ వెళ్లొచ్చిన ప‌వ‌న్ మ‌ళ్లీ హ‌రి హ‌ర షూటింగ్ ని మొద‌లు పెట్ట‌డం.. గ్యాప్ లో మ‌ళ్లీ వెళ్లిరావ‌డం.. రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ ని ప్రారంభించ‌డం తెలిసిందే.

ఈ మూవీ త‌రువాత మ‌రో రెండు రీమేక్ సినిమాల‌ని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు ప‌వ‌న్. అవి పూర్త‌యిన త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ తో చేయాల‌నుకున్న 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' ని సెట్స్ పైకి తీసుకెళ‌తాడ‌ట‌.

అంత వ‌ర‌కు హ‌రీష్ శంక‌ర్ ఖాలీగా గోళ్లు గిళ్లుకుంటూ వుండాల్సిందే. అయితే అలా వుండ‌టం ఇష్ట‌లేని హ‌రీష్ శంక‌ర్ ఈ స‌మ‌యంలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌.

గ‌త‌కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ తో హ‌రీష్ శంక‌ర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని స‌ల్మాన్ తో ఎలాగైనా ఫైన‌ల్ చేయించుకోవాల‌నే ఆలోచ‌న‌తో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ బాలీవుడ్ హీరో స‌ల్మాన్ చుట్టూ ప్ర‌ద‌క్షిణలు చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం త‌న‌ని ఒప్పించ‌డానికి హ‌రీష్ శంక‌ర్ ముంబై వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. హ‌రీష్ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌' మూవీలో న‌టిస్తున్నాడు. దీనితో పాటు 'టైగ‌ర్ 3'లోనూ న‌టిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ఈ రెండింటి త‌రువాత మ‌రో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఒక‌వేళ హ‌రీష్ శంక‌ర్ కు ఓకే చెబితే ఈ మూవీని భారీ స్థాయిలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా చెబుతున్నారు. హ‌రీష్ వంక‌ర్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? స‌ల్లూ భాయ్ క‌రుణిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.