Begin typing your search above and press return to search.
బాలయ్యను సాయిపల్లవి నాన్నా అంటుందా..?
By: Tupaki Desk | 19 March 2021 8:00 AM ISTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బీబీ-3 ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలని ఇటు బాలయ్య, అటు బోయపాటి తీవ్రంగా కృషిచేస్తున్నారు. మే లో స్లాట్ బుక్ చేసిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ తర్వాత ఓ రివేంజ్ డ్రామాలో నటించబోతున్నాడట నట సింహం. యువ దర్శకుడు వినిపించిన స్క్రిప్టుకు బాలయ్య ఫిదా అయిపోయాడట. ఈ మూవీలో బాలయ్యకు భార్యగా సీనియర్ నటి కనిపించనుందట. అయితే.. ఇందులో బాలకృష్ణకు ఓ కూతురు ఉంటుందట. ఆ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితేనే న్యాయం జరుగుతుందట.
ఈ పాత్రలో సాయి పల్లవి నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. నేచురల్ బ్యూటీ ఈ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ ప్రతిపాదన సాయిపల్లవి వరకు చేరలేదట. మరి, సంప్రదిస్తే.. ఎలాంటి ఆన్సర్ వస్తుందో అన్నది ఆసక్తికరం.
ఇప్పుడు బాలయ్య బీబీ-3 బిజీగా ఉండగా.. సాయి పల్లవి విరాటపర్వం, శ్యామ్ సింఘరాయ్ వంటి చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. ఒకవేళ వీరిద్దరి కాంబో సెట్ అయితే.. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్తుందటని టాక్. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.