Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ మళ్లీ వాయిదా పడనుందా...?

By:  Tupaki Desk   |   24 March 2020 9:50 AM GMT
ఆర్ ఆర్ ఆర్ మళ్లీ వాయిదా పడనుందా...?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో డైలీ ఏదో ఒక న్యూస్ తో వార్తల్లో ఉంటున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమాను ఎలా బ్యాలన్స్ చేసి అభిమానులను మెప్పిస్తాడో చూడాలని అందరూ ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

అదేంటి అంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ మళ్ళీ వాయిదా పడనుందట. వివరాల్లోకి వెళ్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రారంభమైన దగ్గర నుండి ఎప్పుడూ దానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గాయపడటంతో కొన్ని రోజులకు షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ తమ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోడం, వియఫ్ఎక్స్ లేట్ అవడం వంటి అనేక అనేక అవాంతరాల కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల జులై 2020 నుండి జనవరి 2021కి మారింది. ఈ సారైనా వాయిదా లేకుండా రావాలని రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కరోనా రూపంలో మరో అవరోధం వచ్చి చేరింది. సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్ వెంటనే మొదలవుతుందన్న దాఖలాలు కనిపించడం లేదు. కరోనా ప్రభావం అంతకంతకు పెరిగిపోవడమే దీనికి కారణం. దీనితో ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య టెన్షన్ పడుతున్నారని వినికిడి. ఏదేమైనా అన్నీ సవ్యంగా జరిగి ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికే రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.